స్టార్ డైరెక్టర్ రాజమౌళి సాధారణంగా తను తెరకెక్కించే సినిమాలకు సంబంధించిన కథల గురించి ముందుగానే కొంతవరకు చెబుతారు. మర్యాదరామన్న, ఈగ విషయంలో రాజమౌళి ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అయితే బాహుబలి సిరీస్ నుంచి జక్కన్న రూటు మార్చారు. సినిమా రిలీజయ్యే వరకు ప్రేక్షకులకు కథ విషయంలో క్లారిటీ రాకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటివరకు రిలీజైన టీజర్లు, గ్లింప్స్ లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ కథకు సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు.
టీజర్లు, గ్లింప్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉండటంతో ఆర్ఆర్ఆర్ కథకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్లు రాజమౌళిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెకన్ల కాలంలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే సీన్లు ఉండేలా రాజమౌళి టీజర్లను, గ్లింప్స్ ను రిలీజ్ చేస్తుండటం గమనార్హం. జక్కన్న ట్రైలర్ లో అయినా ఆర్ఆర్ఆర్ కథ గురించి క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. చరణ్, తారక్ డైలాగ్స్ ఉండేలా ట్రైలర్ ను ప్లాన్ చేయాలని ఆయా హీరోల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరోవైపు హీరోయిన్లకు గ్లింప్స్ లో పెద్దగా ప్రాధాన్యత దక్కలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వచ్చే నెలలో రిలీజ్ కానుండగా ట్రైలర్ తో జక్కన్న సినిమాపై అంచనాలను ఇంకా పెంచుతారేమో చూడాల్సి ఉంది. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందిస్తుందని చరణ్, తారక్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 2022 సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.