‘ఆర్ఆర్ఆర్’ నుండి తప్పుకోవడానికి కారణమిదే!

ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’తో పాటు పలు సినిమాలకు రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా పని చేశారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళిని ఉద్దేశిస్తూ రామ్-లక్ష్మణ్ కొన్ని కామెంట్స్ చేశారు. రాజమౌళి సినిమాలకు పని చేసినా పేరు రాదని చెప్పి షాకిచ్చారు. తన సినిమాల ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటారని..

70 శాతం స్టంట్స్ కూడా రాజమౌళి స్వయంగా పర్యవేక్షిస్తాడని.. దీంతో స్టంట్స్ తామే స్వయాంగా చేసినా కూడా ఆ ఫీలింగ్ ఉండదని రామ్-లక్ష్మణ్ అన్నారు. రాజమౌళి సినిమాలకు పని చేసిన ఫైట్ మాస్టర్స్ ఎవరికీ పెద్దగా రాదని.. క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్తుందని అన్నారు. అయితే రాజమౌళి సినిమాలకు పని చేయడానికి తాము ఎప్పడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. కానీ ఆయనతో సినిమా చేయాలంటే ఒకేసారి నలభై నుండి అరవై రోజుల వరకు డేట్స్ ఇవ్వాలని..

ఆయన అడిగినప్పుడు టైమ్ లేదు, ఇప్పుడు కుదరదనే మాటలు చెబితే ఆయనకు అసలు నచ్చదని చెప్పారు. డేట్స్ ఎక్కువగా ఇవ్వలేకపోవడం వలనే తాము ‘బాహుబలి’, ‘ఆర్ఆర్’ సినిమాలకు పని చేయలేకపోయామని క్లారిటీ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ పది రోజులు చిత్రీకరించామని.. చరణ్ కు దెబ్బ తగలడంతో ఆ సినిమా షూటింగ్ నలభై రోజులు ఆగిపోవడంతో ఆ సినిమా నుండి తప్పుకోక తప్పలేదని చెప్పుకొచ్చారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus