ఆర్ ఆర్ ఆర్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి చేస్తున్న చిత్రం కావడంతో పాటు, చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీ స్టారర్ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. దీనితో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం బాహుబలి 2ని మించిపోయింది. కాగా ఎన్టీఆర్, చరణ్ లు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజులుగా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సన్నివేశాలు ఉన్నట్లు ఇటీవల లీక్స్ ద్వారా తెలిసిన సమాచారం. ఐతే భిన్న ప్రాంతాలు, నేపధ్యాలు కలిగిన భీమ్, చరణ్ లను రాజమౌళి ఎలా కలిపాడు అనేది ఆసక్తికరం.
కొమరం భీమ్ తెలంగాణ ప్రాంతంలో నవాబు పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. ఇక అల్లూరి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. వీరి కాలాల్లో కూడా తేడా ఉంది. మరి చరిత్రను వక్రీకరించి రాజమౌళి ఎలా తీశారు అనేది ఇక్కడ పాయింట్. ఐతే రాజమౌళి ముందుగానే ఇది చారిత్రక పాత్రలతో తెరక్కుతున్న ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు. కాగా అల్లూరి, భీమ్ తమ జీవితాలలో కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో వెళ్లారు. రాజమౌళి కూడా ఈ నేపథ్యం తీసుకొని, వారు జనజీవనానికి దూరంగా గడిపిన సమయంలో కలిసి నట్టు చూపించే అవకాశం కలదు. ఇక వీరిద్దరి మధ్య భీకర పోరు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి జక్కన వీరిద్దరితో ఎన్ని మ్యాజిక్స్ చేయనున్నారు.
Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!