ఈ లాక్ డౌన్ టీంలో డైరెక్ట్ ఓటిటిలో రిలీజైన్ క్రేజీ సినిమా.. అలాగే కాస్తో కూస్తో పెద్ద సినిమా ఏదైనా ఉందా? అంటే కచ్చితంగా అది ‘పెంగ్విన్’ సినిమా అనే చెప్పాలి. ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్లో.. కార్తీక్ సుబ్బరాజు నిర్మాణంలో వచ్చిన ‘పెంగ్విన్’ చిత్రాన్ని..’మహానటి’ కీర్తి సురేష్ పేరు చెప్పి బాగానే ప్రమోట్ చేశారు. జూన్ 19న ‘పెంగ్విన్’ .. డైరెక్ట్ గా ‘అమెజాన్ ప్రైమ్’ లో విడుదల అయ్యింది.అయితే ‘థ్రిల్లర్ ఎలిమెంట్స్’ అని ప్రమోట్ చేసినంత రేంజ్లో ఈ చిత్రం ఏమీ లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు.
‘తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రట్సాసన్’ ను అలాగే విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమాని .. మిక్స్ చేసినట్టు ఉంది’ అని కూడా ‘పెంగ్విన్’ ను విమర్శించారు. అయినప్పటికీ ఈ చిత్రాన్ని కీర్తి సురేష్ కోసం ప్రేక్షకులు బాగానే చూసారు. ఎదో ఒక రకంగా నిర్మాతలు, అలాగే అమెజాన్ వారు గట్టెక్కేసారు అనుకోండి.! అయితే ప్రేక్షకులను మాత్రం ఈ చిత్రం అంత సంతృప్తి పరచలేకపోయింది. దీంతో అనుష్క ‘నిశ్శబ్దం’ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.
హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరెక్కిన ఈ చిత్రాన్ని ‘ఓటిటిలో విడుదల చేసే అవకాశం లేదు.. డైరెక్ట్ గా థియేట్రికల్ ఇస్తాం’ అని నిర్మాతలు మొదట చెప్పినప్పటికీ.. ఇప్పట్లో థియేటర్లు ఎలాగూ తెరుచుకోలేని పరిస్థితి లేదని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.అందులోనూ ఈ చిత్రానికి నెల నెల వడ్డీలు కట్టడానికి కూడా నిర్మాతలకు తడిసి మోపుడవుతుందట. దాంతో ‘నిశ్శబ్దం’ నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ‘కీర్తి ఎలాగూ మెప్పించలేకపోయింది..కనీసం అనుష్క అయినా ‘నిశ్శబ్దం’ తో ఆకట్టుకుంటే అదే చాలు’ అని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు