టాస్క్ లో అంత బాగా ఆడిన శివకి ఫలితం ఏంటి ? సీజన్ – 6 టిక్కెట్ దొరికినట్లేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో టాప్ – 3లో ఒకడిగా నిలిచాడు యాంకర్ శివ. అఖిల్ , బిందు మాధవి ఇద్దరితో పోటీగా ఆడి టాప్ -3 లో నిలిచాడు. గేమ్ అంత బాగా ఆడినా, టాస్క్ లలో అంత గట్టిగా పెర్ఫామ్ చేసినా శివకి మిగిలింది ఏంటి అని ఇప్పుడు బిగ్ బాస్ వ్యూవర్స్ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఫినాలేలో ఎలిమినేషన్ ప్రోసెస్ జరిగేటపుడు టాప్ – 3 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు బ్రీఫ్ కేస్ లో క్యాష్ పెట్టి హౌస్ మేట్స్ కి ఆశ చూపిస్తారు.

కానీ, ఈసారి సీజన్ లో మాత్రం టాప్ – 4 మెంబర్స్ ఉన్నప్పుడు సిల్వర్ సూట్ కేస్ పంపిచాడు బిగ్ బాస్. కానీ, శివ ఎలిమినట్ అయిపోయిన తర్వాత గోల్డెన్ బ్రీఫ్ కేస్ ని టాప్ – 2 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు స్వయంగా నాగార్జున హౌస్ లోకి వెళ్లి తీసుకుని వచ్చాడు. ముందుగానే స్టేజ్ పైన బాంబ్ లని పేలుస్తూ చాలా ఆసక్తికరంగా యాంకర్ శివని ఎలిమినేట్ చేసేశారు. ఇక చాలా ఆనందంగా హౌస్ నుంచీ బయటకి వచ్చిన యాంకర్ శివ తన తల్లిదండ్రులు ఇద్దరినీ స్టేజ్ పైకి పిలిచాడు.

నాగార్జునకి, బిగ్ బాస్ కి థ్యాంక్స్ చెప్పాడు. అయితే, ఇక్కడే సీజన్ – 6 టిక్కెట్ ఇవ్వండి అంటూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానంటూ అడిగాడు. మరి ఇప్పుడు ఈ సీజన్ 6 టిక్కెట్ శివకి దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి నాన్ స్టాప్ హౌస్ లోకి వచ్చినప్పుడు యాంకర్ శివకి పెద్దగా పేరు లేదు. అంతేకాదు, మొదటి రెండు మూడు వారాలు ఎలిమినేషన్ డేంజర్ లో కూడా ఉన్నాడు.

అయినా కూడా తనదైన స్టైల్లో గేమ్ ఆడాడు యాంకర్ శివ. టాస్క్ లో 100 శాతం పెర్ఫామ్ ఇచ్చి టాప్ – 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు. టాప్ – 3లో ఉన్న కంటెస్టెంట్ కి ఇప్పుడు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది అనేది ఆసక్తికరం. మాములుగా అయితే ప్రతి కంటెస్టెంట్ కి వారానికి రెమ్యూనిరేషన్స్ అనేవి ఇస్తుంటారు. ఇప్పుడు శివకి కేవలం అది మాత్రమే మిగిలిందా అని ఆడియన్స్ బాధపడుతున్నారు. అంతేకాదు, టాప్ – 3లో ఉన్నవారికి ఎలాంటి క్యాష్ ప్రైజ్ లేకపోవడంతో బిగ్ బాస్ పై కామెంట్స్ చేస్తున్నారు.

విన్నర్ అయిన బిందుకి 40 లక్షలు, సిల్వర్ సూట్ కేస్ తీసుకున్న అరియానాకి 10 లక్షలు కలిపి 50 లక్షలు ప్రైజ్ మనీ అనేది పంచేశారు. కానీ, టాప్ – 2లో ఉన్న అఖిల్ కి, ఇంకా టాప్ – 3లో ఉన్నవారికి ఎలాంటి క్యాష్ ప్రైజ్ లేకపోవడం పై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి యాంకర్ శివకి మిగిలింది ఇంతేనా అని , అయ్యే పాపం శివ అని బిగ్ బాస్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి అదీ మేటర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.