ఒకప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకాలంటే తెరవెనుక పెద్ద తతంగమే నడిచేది. కమీషన్లు, రహస్య ఒప్పందాలతో మధ్యవర్తులు ఆడిందే ఆట. ఇప్పుడు సేమ్ సీన్ ఓటీటీలో రిపీట్ అవుతోంది. ఇండస్ట్రీలో ఈ కొత్త మాఫియా హాట్ టాపిక్‌గా మారింది.మొదట్లో ఓటీటీ డీల్స్ చాలా పారదర్శకంగా జరిగేవి. ఏజెన్సీలు నిర్మాతలకు, ప్లాట్‌ఫామ్‌లకు మధ్య ఉండి చిన్నపాటి కమీషన్ తీసుకునేవి. ఆ తర్వాత ప్లాట్‌ఫామ్‌లే నేరుగా మేకర్స్‌తో డీల్స్ చేసుకోవడంతో మధ్యవర్తుల అవసరం తప్పింది. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త మధ్యవర్తులు పుట్టుకొచ్చారు. కోట్ల కమీషన్లు దండుకుంటూ నిర్మాతలకు, ఓటీటీలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నారు.
OTT Deals
తాజాగా ఓ స్టార్ హీరో సినిమా నాన్-తెలుగు రైట్స్ విషయంలో మధ్యవర్తులు ఏకంగా రూ.9 కోట్లు కమీషన్ తీసుకున్నారని టాక్. ఇక తెలుగు రైట్స్ కోసం మరో భారీ కమీషన్ డీల్ నడుస్తోందట. పైకి ఇది నిర్మాతలకు సులువుగా అనిపించినా, ఈ దందా వెనుక పెద్ద స్కామ్ నడుస్తోంది.ఇండస్ట్రీలో ఇద్దరు, ముగ్గురు అగ్ర నిర్మాతల చేతిలోకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంట్రోల్ వెళ్లిపోవడమే అసలు సమస్య. ప్రతి ఓటీటీకి సినిమాలు కొనడానికి ఒక ఫిక్స్‌డ్ బడ్జెట్ ఉంటుంది.
ఈ బడా నిర్మాతలు తమకున్న పలుకుబడితో ఒకటి, రెండు పెద్ద సినిమాలకే ఆ బడ్జెట్ మొత్తం ఖర్చయ్యేలా చేస్తున్నారు. దీంతో మీడియం, చిన్న సినిమాలను కొనేందుకు ఓటీటీల దగ్గర డబ్బులు ఉండటం లేదు.తీరా ఆ భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీకి కొత్త సబ్‌స్క్రైబర్లను తేలేకపోతే, ప్లాట్‌ఫామ్‌ల బడ్జెట్లు మరింత తగ్గిపోతున్నాయి. దీని ప్రభావం మిగతా సినిమాలపై పడుతోంది. అంతకుమించి, కొందరు ఓటీటీ కీలక అధికారులు, ఈ నిర్మాతలు, మధ్యవర్తులు ఒక సిండికేట్‌గా ఏర్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి.
ఎలాంటి మొహమాటం లేకుండా వీరి మధ్య కిక్‌బ్యాక్‌లు నడుస్తున్నాయని తెలుస్తోంది.కేవలం ఈ సిండికేట్‌తో సంబంధాలు ఉన్న మేకర్స్ లేదా వీరి బ్యానర్లలో సినిమాలు తీసేవారికే ఓటీటీ డీల్స్ దక్కుతున్నాయి. మిగతా నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీకి అమ్ముకోలేని దయనీయమైన పరిస్థితి నెలకొంది.