టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరికీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించిన ఘనత పూరి జగన్నాథ్ కు ఉందని చెప్పాలి.అయితే ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ కు బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త చేదు అనుభవం ఎదురవుతుంది. ఇకపోతే తాజాగా పూరి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసింది.
ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాథ్ కలిసి ఇన్ స్టా లైవ్ ద్వారా పలు విషయాలను ముచ్చటించారు. ఈ క్రమంలోనే చిరంజీవి పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తూ ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ ఫ్లాప్ నుంచి ఎలా బయటపడతావు అని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు పూరి జగన్నాథ్ సమాధానం చెబుతూ పలు విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ లైఫ్ లో ఏదైనా ఒక గాయం తగిలితే తొందరగా మానుపోయే గుణం ఉండాలి. యుద్ధాలు జరిగిన ప్రాణాలు కోల్పోయిన ఆ హీలింగ్ టైం తక్కువగా ఉండాలి. ఈ బాధ నుంచి బయటపడాలంటే వెంటనే వేరే పనిలో నిమగ్నం కావాలని ఈయన తెలిపారు. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు ఏమైనా జరగవచ్చు.
నేను లైగర్ సినిమా మూడు సంవత్సరాలు పాటు కష్టపడి తీసాను ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటేనే కాస్త బాధ వేసింది వెంటనే జిమ్ కి వెళ్లి 10 స్కాట్స్ చేశాను స్ట్రెస్ మొత్తం వెళ్లిపోయింది. సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాను కదా అని మరో మూడు సంవత్సరాల పాటు ఏడుస్తూ కూర్చోలేము కదా.ఇలా ఈ సినిమా ఫ్లాప్ అయిందని తెలియగానే వెంటనే మరొక సినిమా కథ రాయడం మొదలు పెట్టాను. ప్రస్తుతం ఈ సినిమా పనిలో బిజీగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా పూరి మొదటిసారి లైగర్ ప్లాప్ గురించి స్పందించారు.