Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » కొత్తదనమే విజయమంత్రం

కొత్తదనమే విజయమంత్రం

  • September 13, 2017 / 01:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొత్తదనమే విజయమంత్రం

మనదేశంలో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ టాలీవుడ్. అయితే కొన్నేళ్లుగా మూసధోరణికి అలవాటుపడిపోయి.. అపజయాలను ఎక్కువగా నమోదు చేసుకుంటూ వస్తోంది. బాలీవుడ్ వారి నిర్మాణ విలువలు చూడు ఎలా ఉన్నాయో.. కోలీవుడ్ సినిమాల్లో సహజత్వం ఉంటుంది.. మల్లూవుడ్ లో కొత్త కథలను ఆహ్వానిస్తారు.. అనే మాటలతో తెలుగుచిత్ర పరిశ్రమను ఎక్కువగా విమర్శించేవారు. ఆ విమర్శలకు ఈ ఏడాది వచ్చిన సినిమాలు గట్టిగా సమాధానం చెప్పాయి. 2017 లో ఇప్పటికీ వంద సినిమాలకు పైగా రిలీజ్ అవ్వగా వీటిలో పదికి మించి బ్లక్ బస్టర్ జాబితాలో చేరాయి. ఈ సినిమాల విజయరహస్యాన్ని పరిశీలిస్తే కొత్తదనమే విజయమంత్రం అని స్పష్టం అవుతోంది.

ఖైదీ నంబర్‌ 150Khaidi No 150మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ రూపంలో సంక్రాంతికి బరిలోకి దిగారు. జనవరి 11 న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచి పోరాడిన ఓ యువకుడి కథతో అందరూ కనెక్ట్ అయ్యారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన 150 కోట్ల పైన కలక్షన్స్ సాధించి చిరు సత్తాని చాటింది.

గౌతమిపుత్ర శాతకర్ణి Goutamiputra Shatakarniజనవరి 12 న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ రిలీజ్ అయింది. చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఏకతాటిపైకి తెచ్చేందుకు తొలి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి చేసే పోరాటాన్ని వెండితెరపై చూసేందుకు తెలుగువారందరూ తరలివచ్చారు. విజయ హారతి ఇచ్చారు.

శతమానంభవతి Shatamanam Bhavatiప్రస్తుతం ఉద్యోగ రీత్యా తల్లిదండ్రులకు పిల్లలు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రుల మానసిక స్థితిని, కుటుంబం అంతా కలిస్తే వచ్చే సంతోషాన్ని, ప్రేమానుబంధాలను కళ్ళముందు ఆవిష్కరించిన చిత్రం శతమానంభవతి. ఆర్థిక విజయంతో పటు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

నేను లోకల్‌ Nenu Localత్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్‌’ ఫిబ్రవరి 3న విడుదలై ఘన విజయం సాధించింది. సాధారణ ప్రేమ కథను విభిన్నంగా చూపించడంలో చిత్ర బృందం సక్సస్ సాధించింది.

ఘాజి Ghazi1971లో ఇండో-పాక్‌ వార్‌ నేపథ్యంలో రూపొందించి చిత్రం ఘాజి. నూతన దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి అత్యద్భుతంగా హిస్టరీని తెరపై ఆవిష్కరించారు. నిజ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని తెలుగుతో పాటు ఇతర భాషలవారు ఆదరించారు.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త Kittu unnadu Jagrataమనుషుల్ని కిడ్నాప్ చేసే కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కుక్కలను కిడ్నాప్‌ చేయడమనే కొత్త కథాంశంతో గా దర్శకుడు వంశీ క్రిష్ణ రూపొందించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త మార్చి 3న విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది.

గురు Guruక్రీడాకారులకు స్ఫూర్తినిచ్చిన చిత్రం గురు. బాక్సింగ్‌ కోచ్‌గా వెంకటేష్ నటించిన ఈ చిత్రం మార్చి 31న విడుదలై ఈ మూవీలో వెంకీ, రితికా సింగ్ నటన క్రీడాకారులతో పాటు సామాన్య ప్రేక్షకుడిని ఆకట్టుకుంది.

బాహుబలి 2 Baahubali 2ఏప్రిల్‌ 28. తెలుగు చిత్ర పరిశ్రమ మరిచిపోలేని రోజు. వివిధ చిత్రాల పేరున నమోదైన అన్ని రికార్డులను బాహుబలి కంక్లూజన్ తన వసం చేసుకుంది. దర్శకధీరుడు రాజమౌళి కొత్త ప్రపంచంతో సృష్టించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1700కోట్లకుపైగా వసూళ్ళను రాబట్టి చరిత్ర సృష్టించింది.

కేశవKeshavaఎడమవైపు ఉండాల్సిన గుండె.. కుడివైపున ఉంటే.. అలా ఉన్న వ్యక్తి హత్యలు చేయాల్సి వస్తే.. ఆలోచనే కొత్తగా ఉంది కదూ.. అందుకే ఈ కథతో తెరకెక్కిన కేశవను యువత హిట్ చేయించారు. నిఖిల్, సుధీర్ వర్మ కలయికలో వచ్చిన ఈ మూవీ క్లిష్ట పరిస్థితిలోను భారీ కలక్షన్స్ అందుకుంది.

అమీతుమీ Ami Tumiకన్ఫ్యుజింగ్ కామెడీతో రాసుకున్న కథను చాలా క్లారిటీగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ వెండి తెరపై చెప్పిన మూవీ అమీతుమీ. తెలంగాణ యాస, డైలాగులు, వెన్నెల కిషోర్‌, ఈషా, అడవి శేషు, శ్రీనివాస్‌ అవసరాల పాత్రలు నటన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. జూన్‌ 9న విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది.

నిన్ను కోరి Ninnu Koriహీరో ప్రేమించుకున్న అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్ళిచేసుకుంటే కథ అయిపోయినట్టే. కానీ తాను ప్రేమించిన , అమ్మాయి పెళ్లి అయినా సంతోషంగా లేదని, ఆమెను తన వద్దకు తెచ్చుకునేందుకు ప్రేమికుడు చేసే ప్రయత్నమే నిన్నుకోరి. నూతన దర్శకుడు శివ నిర్వాణ సరికొత్త స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది.

ఫిదా Fidaaమంచి కాఫీ లాంటి సినిమాలను అందించిన శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన మరో మంచి చిత్రం ఫిదా. ఈ చిత్రం మంచి ప్రేమ కథతో పాటు తెలంగాణ సంప్రదాయాన్ని, యాస, భాషను ప్రతిబింబింది. జులై 21న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

నేనే రాజు నేనే మంత్రి Nene Raju Nene mantriఓ మారుమూల ప్రాంతంలో వడ్డీ వ్యాపారం చేసే జోగేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తెలివి తేటలతో గ్రామ సర్పంచి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే నేపథ్యంతో తెరకెక్కిన మూవీ నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా వచ్చిన ఈ మూవీ ఆగస్ట్‌ 11న విడుదలైన మూడు సినిమాల పోటీలో నిలబడి భారీ కలక్షన్స్ రాబట్టింది.

ఆనందో బ్రహ్మ Anando Brahmaహారర్ క్యామెడీ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయిన సమయంలో వచ్చిన ఆనందో బ్రహ్మ గొప్ప విజయం సాధించింది. మనుషులకు దెయ్యాలు భయపడటమనే వినూత్న కాన్సెప్ట్‌ అందరికీ కొత్తగా అనిపించింది. మహి వి. రాఘవ్‌ దర్శకత్వ ప్రతిభకు వెన్నెల కిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌, షకలక శంకర్‌ల కామెడీ, తాప్సీ నటన తోడై హిట్ సొంతమైంది.

అర్జున్‌రెడ్డి Arjun Reddyప్రేమ కథను బోల్డ్ గా చెప్పి సక్సస్ అందుకున్నాడు నూతన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. హీరో విజరు దేవరకొండ అర్జున్‌రెడ్డి గా అదరగొట్టాడు. అన్ని రకాల ఎమోషన్స్ ని చక్కగా పలికించి సినిమా విజయానికి ప్రధాన కారకుడయ్యాడు. 5 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ పాతిక కోట్ల షేర్ రాబట్టి పాత్ బ్రేకింగ్ మూవీ అని పేరు దక్కించుకుంది.

ఈ విధంగా వినూత్న కథలతో జై లవకుశ, రంగస్థలం సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ami Thumi Movie
  • #Anando Brahma Movie
  • #Arjun Reddy Movie
  • #Baahubali 2 Movie
  • #Fidaa Movie

Also Read

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

related news

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

trending news

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

The RajaSaab Collections: 10వ రోజు..’ది రాజాసాబ్’ కి రూ.200 కోట్లు.. అయినా తక్కువే

4 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ?

4 hours ago
Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

5 hours ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

5 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

5 hours ago

latest news

Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

8 hours ago
Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

9 hours ago
M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

10 hours ago
Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

10 hours ago
Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version