Anirudh: అనిరుధ్ మ్యూజిక్, బీజీఎంతో దేవర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందా?

కోలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ ఒకరని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్న అనిరుధ్ తాను తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు. వికమ్, జైలర్ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్, బీజీఎం ఏ స్థాయిలో ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర సినిమా విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర మూవీ సాంగ్స్, బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశపరచకుండా అనిరుధ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమా సినిమాకు అనిరుధ్ మార్కెట్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. జైలర్ సినిమా బీజీఎం అదుర్స్ అనేలా ఉండటంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. దేవర సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ సన్నివేశాలకు అనిరుధ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉండనుందని తెలుస్తోంది.

అనిరుధ్ ను (Anirudh) ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసి మంచి పని చేశారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 5వ తేదీన దేవర సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో మరపురాని సినిమాగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలు తారక్ కు భారీ విజయాలను అందించడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కెరీర్ లో సరైన హిట్ లేని జాన్వీ కపూర్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus