రాంచరణ్ (Ram Charan) ,దర్శకుడు శంకర్ (Shankar) కలయికలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. కియారా అద్వానీ (Kiara Advani), అంజలి (Anjali) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని దిల్ రాజు (Dil Raju) రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మొదటి వారం సో సోగా కలెక్ట్ చేసినా.. రెండో వీకెండ్ ను ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేదు.
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.101.74 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.153.26 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.