పెద్ద సినిమాలకి ప్రమోషనల్ ఈవెంట్లు చాలా ముఖ్యం.పెద్ద బడ్జెట్ సినిమాలకు అయితే ఇవి చాలా కీలకం. అయితే వీటి విషయంలోనే ఇప్పుడు ఓ పెద్ద సినిమాకి ఎక్కడ లేని తిప్పలు వచ్చి పడినట్లు తెలుస్తుంది. దానికి కూడా ఇంకో 2 పెద్ద సినిమాలు కారణం అవ్వడం షాకిచ్చే విషయం. విషయంలోకి వెళితే.. ‘దేవర’ (Devara) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవాటెల్ వంటి పెద్ద స్టార్ హోటల్లో ప్లాన్ చేసినా.. అక్కడ అధిక సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో తోపులాటలు వంటివి జరిగి హోటల్ అద్దాలు వంటివి ధ్వంసమవ్వడం వంటివి జరిగాయి.
Game Changer
దానిపై కూడా పోలీస్ కేసు వంటివి ఫైల్ అయిన సంగతి తెలిసిందే. ఈవెంట్ మేనేజ్మెంట్ ను పోలీసులు విచారించడం కూడా జరిగింది. అయితే తర్వాత ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ఈవెంట్ ను యూసఫ్ గూఢ పోలీస్ గ్రౌండ్స్ లో, అదే ఈవెంట్ మేనేజ్మెంట్ టీం అద్భుతంగా కండక్ట్ చేసింది. కానీ సంధ్య థియేటర్ వద్ద మళ్ళీ సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ తొక్కిసలాట జరిగింది ఓ మహిళ మృతి చెందింది.
మొత్తంగా ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్, ‘పుష్ప 2’ సంధ్య థియేటర్ల సంఘటనల వల్ల.. రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలకి పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. ఈ సినిమాకి తెలంగాణలో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకి అనుమానితులు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తెలంగాణలో గ్రాండ్ గా చేయడానికి అనుమానితులు నిరాకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ‘గేమ్ ఛేంజర్’ కూడా భారీ బడ్జెట్ తో తీసిన సినిమా.
శంకర్ (Shankar) ఈ చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా. దీనికి థియేట్రికల్ బిజినెస్ కూడా రూ.350 కోట్ల వరకు జరుగుతుందని సమాచారం. ఒక్క నైజాంలోనే ఈ సినిమాకు రూ.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని సమాచారం. సో ఇంత మొత్తాన్ని వెనక్కి రాబట్టాలంటే టికెట్ రేట్లు హైక్స్ లేకుండా కష్టం. అందుకే దిల్ రాజు కిందామీదా పడుతున్నట్లు సమాచారం.