Game Changer Twitter Review: అప్పన్న, రామ్ నందన్.. ఇద్దరిలో ఎవరు మెప్పించారు?

[Click Here For Filmy Focus Original Review]

5 ఏళ్ళ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ సోలో హీరోగా రూపొందిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేసిన మొదటి సినిమా ఇది. పైగా చరణ్ నుండి ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత రాబోతున్న సినిమా. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్స్ వంటివి పర్వాలేదు అనిపించాయి. తమన్ సంగీతంలో రూపొందిన పాటలు కూడా పాస్ మార్కులు వేయించుకున్నాయి. అంజలి, కియారా అద్వానీ..లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

Game Changer Twitter Review

ఆల్రెడీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) షోలు కొన్ని చోట్ల పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా మొదటి 15 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందట. తర్వాత మెల్ల మెల్లగా కథలోకి వెళ్తుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ మెప్పిస్తుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మినిస్టర్ మధ్య చెలరేగిన ఇగో క్లాష్.. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ కి బాగా కనెక్ట్ చేసారని అంటున్నారు.’నానా హైరానా’ ‘జరగండి’ ‘దోప్’ వంటి సాంగ్స్ విజువల్ గా ఆకట్టుకున్నాయి అంటున్నారు.

బుర్రా సాయి మాధవ్ డైలాగులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయట. కొన్ని విజువల్స్ అయితే పెట్టిన టికెట్ రేటుకి వార్త అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్లో రాంచరణ్ చేసిన అప్పన్న పాత్ర.. అతని కెరీర్ బెస్ట్ అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus