నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి విడుదలకు ముందు కాస్త డౌట్‌ఫుల్ వాతావరణం క్రియేట్ చేసినప్పటికీ, సినిమా విడుదల అయ్యాక మాత్రం రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుంది…అసలైతే బాలయ్య కరియర్ లోనే లెజెండ్ సినిమా 42కోట్ల వసూళ్లు సాదించి సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ గా నిలవగా…క్రిష్ మాత్రం చాలా ధీమాగా బాలయ్య మార్కెట్ ని మించి దాదాపుగా 60కోట్ల బడ్జెట్ తో శాతకర్ణి సినిమాని తెరకెక్కించాడు…అయితే అదే క్రమంలో ఈసీనిమా రిసల్ట్ పై ధీమాగా ఉన్నప్పటికీ రిస్క్ చేస్తున్నామేమో అన్న సందేహం సైతం ఉండేది నిర్మాతకు…అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రభజనమైన వియజయం సాదించడంతో డిస్‌ట్రిబ్యుటర్స్ మాట్లాడుతూ…..తమ నమ్మకాన్ని, ప్రస్తుత పరిస్తితిని ఇలా పంచుకున్నారు….యుఎస్ లో ఈ సినిమాని డిస్‌ట్రిబ్యూట్ చేసిన డిస్‌ట్రిబ్యుటర్ మాట్లాడుతూ…ఈ సినిమా అక్కడ 2మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టడం ఖాయం అని తెలిపాడు.
అదే క్రమంలో….సీడెడ్.. వైజాగ్ ఏరియాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ‘లెజెండ్’ ప్రొడ్యూసర్.. బాలయ్య మిత్రుడు సాయి కొర్రపాటి స్పందిస్తూ.. ‘‘సీడెడ్ ఏరియా బాలయ్యకు కంచుకోట. ఆయనకు ఇక్కడున్న బలం దృష్ట్యా అందరూ ఫ్యాన్సీ రేట్లకు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తీసుకున్నారు. ఆదివారానికి సీడెడ్లో అందరూ బ్రేక్ ఈవెన్ కు వచ్చేస్తారు. ఆల్ టైం కలెక్షన్ల రికార్డుల్లో ఈ సినిమా టాప్-5లో ఉంటుంది’’ అని చెప్పాడు. తూర్పు గోదావరిలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ బాబు కూడా హర్షం వ్యక్తం చేశాడు. ఇక నైజాం ఏరియాలో ‘శాతకర్ణి’ని కొన్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూడగానే ఇది బాలయ్య కెరీర్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేశాను. నా మాటే నిజమై ఇప్పుడీ సినిమా అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. సోమవారం నుంచి ఈ సినిమాకు ఓవర్ ఫ్లోస్ వస్తాయి’’ అని చెప్పాడు. ఇలా మొత్తానికి మన బాలయ్య ప్రభంజనం కలెక్షన్స్ రికార్డ్స్ సృష్టిస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.