‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram) సినిమాను పట్టుకుని గత కొన్నేళ్లుగా గౌతమ్ మీనన్ (Gautham Vasudev Menon) పోరాటం చేస్తున్నారు. ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ మధ్య మధ్యలో డేట్స్ వినిపిస్తున్నా ఆ సినిమా రావడం లేదు. దీంతో గౌతమ్ మీనన్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే సినిమా ప్రచార చిత్రాలకు చాలా మంది స్పందన వచ్చింది. అయితే విడుదల చేద్దామంటే పంపిణీదారుల నుండి, థియేటర్ల వాళ్ల నుండి సరైన స్పందన రావడం లేదు. విక్రమ్ (Vikram) హీరోగా గౌతమ్ మీనన్ రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ .
Gautham Menon
దాదాపు ఏడేళ్ల క్రితమే సిద్ధమైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టడం నుండి, విడుదల పనుల వరకు అన్నీ ఆలస్యమవుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్ (Gautham Menon) మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆయన తరచుగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ‘మద గజ రాజా’ సినిమా వచ్చి భారీ విజయం సాధించడంతో ఆయనకు ధైర్యం వచ్చింది అనిపిస్తోంది.
12 ఏళ్ల క్రితం రెడీ అయి విడుదల కాకుండా ఉండిపోయిన ఆ సినిమా మొన్న సంక్రాంతికి వచ్చి భారీ విజయం అందుకుంది. దీంతో గౌతమ్ మీనన్ (Gautham Menon) కూడా ‘ధృవ నక్షత్రం’ సినిమా ఇంత గ్యాప్ తర్వాత వచ్చినా విజయం సాధించడం పక్కా అని అంటుటన్నారు. అంతేకాదు ఈ సినిమా తొలుత వేరే హీరోలకు చెప్పారట ఆయన. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్లు రిజెక్ట్ చేశారని, ఆఖరికి సూర్య నో చెప్పడాన్ని తట్టుకోలేకపోయానని చెప్పారు.
‘ధృవ నక్షత్రం’ విడుదల కోసం ప్రయత్నిస్తున్నా. తప్పకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. చాలా కాలం క్రితం ఈ సినిమాను తెరకెక్కించినప్పటికీ ప్రేక్షకులు బోర్ ఫీల్ కారు. నేటితరం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది అని గౌతమ్ మీనన్ అంటున్నారు. మరి ఆయన నమ్మకం నిలబడుతుందా? సినిమాను బయటకు తీసుకొచ్చే వాళ్లు ఎవరు అనేదే ఆసక్తికరంగా మారింది.