చిరు మూవీతో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న హీరోయిన్..!

‘బాయ్స్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జెనీలియా.. ఆ తరువాత ‘సత్యం’ చిత్రంతో కూడా ఆకట్టుకుంది. ఆ వెంటనే ‘సాంబ’ ‘సై’ చిత్రాలు కూడా ఈమె క్రేజ్ ను మరింత పెంచాయి. ఆ వెంటనే వెంకటేష్ తో ‘సుభాష్ చంద్రబోస్’, అల్లు అర్జున్ తో ‘హ్యాపీ’, నితిన్ తో ‘రామ్’ వంటి చిత్రాల్లో ఆఫర్లు అందుకోవడంతో ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.. ఇక ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రాలు ప్లాప్ అవ్వడంతో.. అది సాధ్యం కాలేదు.

దాంతో ‘బొమ్మరిల్లు’ ‘ఢీ’ ‘రెడీ’ వంటి కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను సెలెక్ట్ చేసుకుని వరుస హిట్లు అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. అక్కడి వరకూ బాగానే ఉన్న ‘కథ’ ‘ఆరెంజ్’ ‘నా ఇష్టం’ సినిమాలు ప్లాపవ్వడంతో ఇక బాలీవుడ్ కు చెక్కేసింది. ఇక రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకున్నాక సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం..

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మించనున్నాడు. ‘సాహో’ దర్శకుడు సుజీత్ ఈ రీమేక్ ను తెరకెక్కించనున్నాడు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చెల్లి పాత్ర కోసం జెనీలియాను సంప్రదించాడట సుజీత్. దానికి జెనీలియా కూడా ఓకే చెప్పేసింది తెలుస్తుంది. మొత్తానికి మెగాస్టార్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న జెనిలియా.. సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుందేమో చూడాలి.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus