‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అనుష్క (Anushka Shetty) చేస్తున్న చిత్రం ‘ఘాటి’ (Ghaati) . క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో అనుష్క తో ఈయన ‘వేదం’ (Vedam) అనే సినిమా చేశాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా ఆ సినిమాని టీవీల్లో బాగా చూశారు. దాదాపు 14 ఏళ్ళ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తుంది అనుష్క. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Ghaati Glimpse Review
ఈరోజు అనగా నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు కావడంతో గ్లింప్స్ ని వదిలారు మేకర్స్. ఈ గ్లింప్స్ విషయానికి వస్తే.. ఇది 48 సెకన్ల పాటు ఉంది. కథపై ఎటువంటి క్లూ ఇవ్వకుండా అనుష్క పాత్రని పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ ని కట్ చేశారు. ఓ గిరిజన యువతిగా అనుష్క ఇందులో కనిపించబోతుంది. ఆమె లుక్ కూడా చాలా రస్టిక్ గా అనిపిస్తుంది. కొండ లోయలు కలిగున్న ఓ ప్రాంతంలో ఓ బస్సును ఆపి, అనుష్క అందులోకి ఎక్కడం, ఆ తర్వాత ఓ వ్యక్తి పీకని ఆమె కత్తితో కోయడం.
తర్వాత అతని తల తీసుకుని ఆమె వెళ్లిపోవడం.. ఈ గ్లింప్స్ లో కనిపించింది.నాగవెల్లి విద్యాసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ గ్లింప్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :