దివంగత సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు దివంగత రమేష్ బాబు అందరికీ సుపరిచితమే. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు.. తర్వాత ‘సామ్రాట్’ ‘చిన్ని కృష్ణుడు’ ‘బజార్ రౌడీ’ ‘కలియుగ కర్ణుడు’ ‘ముగ్గురు కొడుకులు’ ‘కలియుగ అభిమన్యుడు’ ‘కృష్ణ గారి అబ్బాయి’ ‘మామ కోడలు’ ‘అన్నా చెల్లెలు’ ‘పచ్చ తోరణం’ వంటి ఎన్నో సినిమాల్లో హీరోగా చేశాడు.
హీరోగా నిలబడడానికి శత విధాలుగా ట్రై చేసినా ఆడియన్స్ ఇతన్ని ఓన్ చేసుకోలేదు. దీంతో ఇతను సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. అటు తర్వాత నిర్మాతగా మారి ‘అర్జున్’ ‘అతిథి’ ‘దూకుడు’ వంటి సినిమాలకు నిర్మాతగా, సహా నిర్మాతగా వ్యవహరించారు.. అయినా సరే ఇతనికి కలిసి రాలేదు. అటు తర్వాత 2022 లో ఈయన అనారోగ్య సమస్యలతో మరణించారు.ఇదిలా ఉండగా.. అతని కుమారుడు జయకృష్ణ హీరోగా లాంచ్ అయ్యేందుకు రెడీ అయ్యాడు.
‘ఆర్.ఎక్స్.100’ ‘మంగళవారం’ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి .. ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఆగస్టు 15 నుండి సైలెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.
ఇక సీనియర్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ గతంలో బాలకృష్ణ ‘బంగారు బుల్లోడు’, నాగార్జున ‘ఆకాశ వీధిలో’, మోహన్ బాబు ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి సినిమాల్లో నటించారు. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాలో ఈమె పవర్ఫుల్ రోల్ పోషించి తన సెకండ్ ఇన్నింగ్స్ కి స్ట్రాంగ్ బేస్ వేసుకున్నారు.