Chiranjeevi: చిరంజీవి మూవీకి బాలీవుడ్ లో ఇంత క్రేజా?

చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్రలో నయనతార నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

సత్యదేవ్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తుండగా చిరంజీవికి విలన్ గా జగపతిబాబు నటిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక పాట ఉంటుందని ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాని బోగట్టా. ప్రముఖ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గాడ్ ఫాదర్ హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 45 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా. సల్మాన్ ఖాన్ నటించడం వల్లే ఈ రేంజ్ లో హక్కులు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తమిళంలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు కచ్చితంగా దక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య సినిమా ఫ్లాపైనా ఆ ప్రభావం చిరంజీవి తర్వాత సినిమాలపై పడలేదు. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.