Pooja Hegde: మొదటిది ప్లాప్ అయినా.. ఇది మంచి ఛాన్సే..!
- September 13, 2024 / 10:32 PM ISTByFilmy Focus
పూజా హెగ్డే (Pooja Hegde) ఈ మధ్యనే 2 సినిమాలు ఫినిష్ చేసింది. బాలీవుడ్లో షాహిద్ కపూర్ (Shahid Kapoor) కి జోడీగా చేసిన ఓ సినిమా అలాగే సూర్యకి (Suriya) జోడీగా చేసిన ఓ సినిమా.. తన పార్ట్ వరకు షూటింగ్ ని కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఇవి తప్ప.. ఈమె చేతిలో మరో సినిమా లేదు. ఎందుకంటే ఈమె ప్లాపుల్లో ఉండటం.. పారితోషికం కూడా ఎక్కువగా ఉండటంతో ఆఫర్లు రాలేదు. ఈ విషయాన్ని గ్రహించి తన పారితోషికం తగ్గించుకుని పూజా.
Pooja Hegde

గతంలో ఆమె రూ.3 కోట్ల వరకు పారితోషికం అందుకుంది. కానీ వరుస ప్లాపుల కారణంగా రూ.70 లక్షలకి ఆమె పారితోషికం తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకి లారెన్స్ (Raghava Lawrence) తెరకెక్కిస్తున్న ‘కాంచన 4’ లో ఛాన్స్ లభించింది. ‘ముని’ సక్సెస్ ఫుల్ సిరీస్ కాబట్టి.. పూజాకి అది మంచి ఛాన్సే అని అంతా అనుకున్నారు. ఇప్పుడు మరో మంచి ఛాన్స్ ఆమెకు లభించినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ (Vijay Thalpathy) హీరోగా హెచ్.వినోద్ (Ch Vinoth) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది.

కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపికైనట్టు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాలో రూ.70 లక్షల పారితోషికానికే నటించడానికి పూజా హెగ్డే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. అయితే ఆమె టీం(మేకప్ టీం, మేనేజర్) వంటి వారి కోసం ఇంకొంచెం డిమాండ్ చేసే ఛాన్స్ ఉందట. అది నిర్మాతకి పెద్ద సమస్య కాదు లెండి. ఏదేమైనా ఈ రెండు సినిమాలు కనుక సక్సెస్ సాధిస్తే.. పూజకి పూర్వ వైభవం వచ్చినట్టే..!














