Good Bad Ugly Collections: మొదటి వారం పర్వాలేదనిపించింది కానీ..!
- April 17, 2025 / 06:16 PM ISTByPhani Kumar
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమాకి డీసెంట్ టాక్ రావడం వల్ల ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహించిన ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మించారు. సినిమాలో అజిత్ ఫ్యాన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి.
Good Bad Ugly Collections:

సుల్తానా పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాట బాగా వైరల్ అవుతుంది. మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.45 cr |
| సీడెడ్ | 0.61 cr |
| ఆంధ్ర | 1.03 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.09 cr |
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వారం ఈ సినిమా రూ.3.09 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.5.19 కోట్లు కలెక్ట్ చేసింది. సో బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.2.41 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే బ్రేక్ ఈవెన్ కి కొంచెం ఎక్కువ టార్గెట్ ఉంది.













