సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) , వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)… హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జాక్’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad),, బాపినీడు నిర్మించారు. ఏప్రిల్ 10న మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో ఓపెనింగ్స్ పై దెబ్బ పడింది. అవి అనుకున్నట్టు రాలేదు. ఇక వీకెండ్ ముగిశాక పరిస్థితి మరీ దారుణం.
Jack Collections:
ఆ తర్వాత నిలబడింది అంటూ లేదు. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు అయితే ఇక లేనట్టే అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘జాక్’ (Jack) సినిమాకు రూ.14.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వారం ఈ సినిమా రూ.4.12 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.6.68 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.11.38 కోట్ల షేర్ ను రాబట్టాలి.