తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు (Ajith Kumar) తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కోవిడ్ తర్వాత అజిత్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ‘వలీమై’ ‘విదాముయర్చి'(పట్టుదల) (Pattudala) దారుణంగా ప్లాప్ అయ్యాయి. ‘తునీవు'(తెలుగులో ‘తెగింపు’) కొంత పర్వాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తో (Good Bad Ugly) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అజిత్. ‘మార్క్ ఆంటోనీ'(Mark Antony) ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) డైరెక్ట్ చేసిన సినిమా ఇది.
Good Bad Ugly
తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవి శంకర్ (Y .Ravi Shankar)..లు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో రిలీజ్ కానుంది. ఒకసారి తెలుగు థియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ చిన్నదే కానీ.. టాక్ పాజిటివ్ గా వస్తేనే ఇక్కడ ఓపెనింగ్స్ వస్తాయి. లేదు అంటే కష్టమే..!