తెలుగు సినిమా పరిశ్రమలో గతకొద్ది రోజులుగా రీ రిలీజ్ అనే ట్రెండ్ నడుస్తోంది.. ప్రేక్షకాదరణ పొందిన పలు సూపర్ హిట్ సినిమాలను అభిమానుల కోరిక మేరకు.. లేటెస్ట్ టెక్నాలజీతో మళ్లీ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.. స్టార్ హీరోలకు సంబంధించిన అకేషన్స్ అప్పుడు స్పెషల్ షోలు వేస్తే ఆ సందడి ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం.. ఇక పాత సినిమాలను థియేటర్లలో చూడడం అనేది ఈ జెనరేషన్ వారికి మెమరీగా నిలిచిపోతుంది..
ఇప్పుడు నటశేఖర, సూపర్ స్టార్, డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ట్రెండ్ సెట్టర్ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నారు.. ఇది నిజంగా ఘట్టమనేని అభిమానులకు కిక్ ఇచ్చే వార్తే.. ఆ సినిమా ఏదో కాదు.. కేవలం తెలుగులోనే కాదు ఇండియాలోనే తెరకెక్కిన ఫస్ట్ ఇండియన్ కౌబాయ్ ఫిలిం.. ‘మోసగాళ్లకు మోసగాడు’.. పద్మాలయా మూవీస్ బ్యానర్ మీద.. ఆయన సోదరుడు జి. ఆదిశేష గిరి రావు నిర్మించగా.. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు..
విజయ నిర్మల కథానాయిక.. 1971 ఆగస్టు 27న రిలీజ్ అయిన ఈ మూవీ ఎన్నో సంచలనాలు సృష్టించింది.. రికార్డ్ స్థాయి వసూళ్లతో పాటు ఇతర దేశాల్లోనూ ప్రదర్శితమైంది.. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అంటే.. 52 సంవత్సరాల తర్వాత మళ్లీ విడుదల చేయబోతున్నారు.. 4K అల్ట్రా హెచ్‌డీ క్వాలిటీ, డీటీఎస్ వంటి సౌకర్యాలతో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ కానుంది..
ఈ వార్తతో కృష్ణ (Krishna) , మహేష్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.. ఇంకో సర్‌ప్రైజ్ ఏంటంటే అదే రోజు SSMB 28 టైటిల్, టీజర్ కూడా రాబోతుంది.. ఇటీవల ఫస్ట్ లుక్ వదలగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ‘మోసగాళ్లకు మోసగాడు’ థియేటర్లలో మహేష్ కొత్త సినిమా టీజర్ ప్రదర్శించనున్నారని తెలుస్తోంది.. మే 31న ‘సూపర్ స్టార్స్’ అభిమానులకు అసలు సిసలు పండుగ.. వాళ్ల ఆనందానికి అవధులుండవ్..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?