యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ సినిమా రీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2003 జూలై 9న విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎన్టీఆర్ కెరీర్లో భారీ కలెక్షన్స్ సాధించిన మూవీ ఇది. ‘ఆది’ తో ఎన్టీఆర్ కు వచ్చిన ‘మాస్’ ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా ‘సింహాద్రి’ అనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
20 ఏళ్ళకే ఇంత మాస్ పెర్ఫార్మన్స్ అతను ఎలా చేశాడా? అని సీనియర్ స్టార్ హీరోలు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఇక సింహాద్రి రిలీజ్ అయ్యి కూడా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘సింహాద్రి’ ని రీ రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయడం విశేషం.
ఈ వేడుకకు ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) అలాగే నిర్మాతలు నవీన్, రవి శంకర్ లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘వీరసింహారెడ్డి’ కి ‘సింహాద్రి’ కి ఉన్న కామన్ పాయింట్ ను వివరించాడు. సింహాద్రి ఇంటర్వెల్ సీన్ లో భూమిక ఎన్టీఆర్ ను పొడిచే సీన్ రిఫరెన్స్ తోనే.. వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి బాలయ్య ను పొడిచే సీన్ ను డిజైన్ చేసినట్లు.. ఈ రెండు సీన్లకు దద్దరిల్లాయని ..!
ఆ సన్నివేశాలు గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని… గోపీచంద్ చెప్పాడు. అలాగే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘మాస్ సీన్ కి న్యాయం చేయాలి అన్నా.. ఆ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలన్నా అది ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడి వల్లే అవుతుందని’ కూడా గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సినిమా సూపర్ హిట్ అయ్యి బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.