గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నా ఈ సినిమాలోని ఒక సన్నివేశం గురించి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వచ్చాయి. ఒక సీన్ లో బాలయ్య కారును కాలితో తంతే ఆ కారు వెనక్కు వెళుతుంది. పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలోని ట్రైన్ సీన్ తో ఆ సీన్ ను పోల్చుతూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన మీమ్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి.
అయితే ఈ సీన్ గురించి గోపీచంద్ మలినేని స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాలో వీరసింహారెడ్డి కారు ముందు గొడ్డలితో నిలబడిన సమయంలో అందులో ఉన్నవాళ్లు కారులో వెనక్కు వెళ్లడానికి రివర్స్ గేర్ వేస్తారని అయితే మట్టిలో కారు చక్రం కూరుకుపోవడం వల్ల కారు వెనక్కు వెళ్లదని గోపీచంద్ మలినేని తెలిపారు. ఆ తర్వాత వీరసింహారెడ్డి పాత్ర డైలాగ్ చెప్పి కారును కాలితో తంతుందని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు.
అప్పటికే కారు రివర్స్ గేర్ లో ఉందని రివర్స్ గేర్ లో ఉన్న కారు ముందుకు రావడం ఏ విధంగా సాధ్యమని గోపీచంద్ మలినేని ప్రశ్నించారు. బాలయ్య గారితో చర్చించి ఆ సీన్ ను షూట్ చేశానని గోపీచంద్ మలినేని కామెంట్లు చేశారు. గోపీచంద్ మలినేని వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా ట్రోల్స్ ఆగిపోతాయేమో చూడాలి. వీరసింహారెడ్డి సక్సెస్ తో ఈ సినిమాలో నటించిన నటీనటులకు సైతం మంచి పేరు వచ్చింది.
వీరసింహారెడ్డి సినిమా హవా మరికొన్ని రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద కొనసాగే ఛాన్స్ ఉంది. సెకండ్ వీకెండ్ లో కూడా ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లను సాధించింది. పది రోజుల్లో ఈ సినిమా 72 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. రిపబ్లిక్ డే సెలవును కూడా ఈ సినిమా క్యాష్ చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది. బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా తెగ నచ్చేసింది.