‘తొలివలపు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు గోపీచంద్.ముత్యాల సుబ్బయ్య ఆ చిత్రానికి దర్శకుడు. ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. పైగా గోపీచంద్ సొంత నిర్మాణ సంస్థలో చేసిన సినిమా కావడంతో వాళ్ళకి చాలా నష్టాలు వచ్చాయి. అటు తర్వాత గోపిచంద్ ఫ్యామిలీలో ఘోరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.అతనికి అయినవాళ్లు దూరమైపోయారు. పైగా అప్పుల భారం కూడా ఉంది. దాంతో అతను విలన్ గా మారి ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి సినిమాల్లో నటించాడు.
‘జయం’ సినిమా తమిళ్ లో రీమేక్ చేయగా అక్కడ కూడా ఇతనే విలన్ గా చేసాడు. వాటితో అప్పులు తీరిపోయాయి. ఈ క్రమంలో మళ్ళీ అతను ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా మారడం.. అది సూపర్ హిట్ అవ్వడం జరిగింది. అయితే ‘యజ్ఞం’ సినిమాని మొదట గోపీచంద్ కోసం అనుకోలేదట. మొదట ఈ కథకి ప్రభాస్ ను హీరోగా అనుకున్నారట. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు గారికి కూడా ఈ కథ వినిపించడం ఆయన ఓకే అనడం జరిగింది.
దర్శకుడిగా బి.గోపాల్ ను అనుకున్నారు. కానీ అప్పటికే ప్రభాస్- బి.గోపాల్ ‘అడవి రాముడు’ కథకి కమిట్ అవ్వడంతో.. ‘యజ్ఞం’ కథకి రైటర్ గా పనిచేసిన ఏ.ఎస్.రవి కుమార్ చౌదరినే దర్శకుడిగా పెట్టి నిర్మాత పోకూరి బాబురావుగారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రభాస్ కు కచ్చితంగా సెట్ అయ్యేది కానీ గోపీచంద్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు.