తెలుగులో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో చాలా పాపులర్ అయ్యింది. ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు కూడా సినిమాల్లో అవకాశాలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ 1.. బ్లాక్ బస్టర్ అయితే,నాని హోస్ట్ చేసిన సీజన్ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇక నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ 3 అయితే డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు ఎలాగో లాక్ డౌన్ కాబట్టి.. ఇంట్లోనే ఉంటున్న వారు ‘టీవీల్లో సినిమాలు ఎన్ని రోజులని చూడాలి..? ‘బిగ్ బాస్4′ త్వరగా మొదలైతే బాగుణ్ణు’ అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘బిగ్ బాస్’ నిర్వాహకులు కూడా ఇదే మంచి టైం అని.. ‘సీజన్ 4’ ను త్వరగా స్టార్ట్ చెయ్యాలి అని భావిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది సెలబ్రిటీలతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తుంది. త్వరలోనే ఈ షోని ప్రారంభించాలి అని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా తెలుగులో నాగార్జునే హోస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈ షో నిర్వహించకూడదు అని ప్రభుత్వం నోటీసులు పంపనున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఓ మహమ్మారి ఎక్కువగా వ్యాపిస్తున్న తరుణంలో.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాక్ డౌన్ ఇక ముగిసే సమయం కూడా వచ్చేసింది.
ఇలాంటి తరుణంలో ‘బిగ్ బాస్’ షో నిర్వహిస్తే.. హౌస్ బయట ఎంతో మంది.. దీనికోసం పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి సామజిక దూరం పాటించడం కష్టమవుతుందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. కేవలం తెలుగులో మాత్రమే కాదు అన్ని భాషల్లోనూ ‘బిగ్ బాస్’ షోను నిలిపివేయాలి అని హై కోర్టుకు నోటీసులు ఎక్కువగా వెళ్తున్నట్టు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకూ నిజముందో తెలియాల్సి ఉంది.