రాజకీయం రచ్చకెక్కింది, నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కిన గౌతమిపుత్ర శాతకర్ణి.. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే….అయితే చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వినోదపు పన్ను నుంచి మినహాయింపును ఇచ్చాయి. అయితే ఈ అంశాన్ని చూపిస్తూనే….గతేడాది తాను రూపొందంచిన రుద్రమదేవి చిత్రానికి వినోదపు పన్ను నుంచి మినహాయింపు కోరిన విషయాన్ని గుర్తు చేశాడు దర్శక నిర్మాత గుణ శేఖర్. ఎంతో కష్టపడి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, దక్షిణపథాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మహిళలగా ఘనకీర్తిని సాధించిన రుద్రమదేవి జీవితాన్ని స్వీయ నిర్మాణంలో తెరపైకి తీసుకువచ్చాను….అయితే ఈ ఆదర్శవంతమైన కథకు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి పన్ను మినహాయింపు ఇచ్చింది. కానీ ఇప్పటికీ ఏపీ అధికారులు మాత్రం.. నా అభ్యర్ధనను మన్నించలేదు.
అందుకే శాతకర్నికి ఇచ్చిన విధంగా మా సినిమాకు కూడా అలా ఇవ్వాలని… అప్పటి నా దరఖాస్తును తిరిగి పరిశీలించి.. రుద్రమదేవి చిత్రానికి ఏపీలో వసూలు చేసిన వినోదపు పన్ను మొత్తానికి సరిసమానంగా ప్రోత్సాహక నగదును తనకు ఇప్పిస్తే.. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పని చేస్తోందని అందరూ భావిస్తారంటే మెలిక పెట్టాడు ఈ దర్శకుడు. అయితే అంతా బాగానే ఉంది కానీ, శాతకర్ణి విషయంలో పన్ని రాయతీపై ఎప్పుడో నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, అనుకోకుండా ఈరోజే గుణ శేఖర్ ఇలా బయటకు రావడంతో వెనుక ఎవరో ఉన్నట్లు, కావాలని ఇలా రాజకీయం చేస్తున్నట్లు, ఇది పక్కా ప్లాన్ అన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.