12 ప్లాపుల తర్వాత ‘ఇష్క్’ మూవీతో హిట్ కొట్టి ఊపిరి పీల్చుకున్నాడు నితిన్. ఆ తర్వాతి ఏడాది ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిత్యా మేనన్,ఇషా తల్వార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.విజయ్ కుమార్ కొండా ఈ చిత్రానికి దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం, కామెడీ, తొలిప్రేమ మూవీలోకి సంబంధించిన ఓ రీమిక్స్ సాంగ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. మొదట ఈ మూవీ పై పెద్దగా అంచనాలు లేవు.
అయితే మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం.. సమ్మర్ సీజన్ కూడా కలిసి రావడంతో సినిమాకి మంచి కలెక్షన్లు నమోదయ్యాయి. 2013 వ సంవత్సరం ఏప్రిల్ 19న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.80 cr |
సీడెడ్ | 2.50 cr |
ఉత్తరాంధ్ర | 2.55 cr |
ఈస్ట్ | 1.45 cr |
వెస్ట్ | 1.25 cr |
గుంటూరు | 1.70 cr |
కృష్ణా | 1.20 cr |
నెల్లూరు | 0.75 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 19.20 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 3.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 22.60 cr |
‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రానికి రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.22.6 కోట్ల షేర్ ను నమోదు చేసింది. అంటే బయ్యర్లకి రూ. 14.6 కోట్ల భారీ లాభాలను అందించింది అని చెప్పొచ్చు.ప్రతీ ఏరియాలోనూ ‘ఇష్క్’ చిత్రానికి డబుల్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. అంతేకాదు ఆ టైంకి నితిన్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన మూవీగా కూడా రికార్డ్ సృష్టించింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!