మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ సినిమా రిలీజ్ కు రెండు నెలల సమయం మాత్రమే ఉండగా పొలిటికల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గుంటూరు కారం బిజినెస్ లెక్కలు సైతం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉన్నాయి. గుంటూరు కారం సినిమాకు 140 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది.
నైజాంలో దిల్ రాజు ఈ సినిమా హక్కులను 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా ఈ సినిమా ఆంధ్ర ఏరియా హక్కూ 50 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సీడెడ్ ఏరియా హక్కులు మాత్రం 15 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీవర్గాల్లో వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల వరకు ఈ సినిమా హక్కులు 110 కోట్ల రూపాయలకు అమ్ముడవగా కర్ణాటక, ఓవర్సీస్, ఇతర ఏరియాల హక్కులు మరో 30 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.
మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని ఈ సినిమా మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండను్దని తెలుస్తోంది. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలకు పెద్దపీట వేశారని సమాచారం అందుతోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గత సినిమాలు కలెక్షన్ల విషయంలో నిరాశపరచగా ఈ సినిమా విషయంలో ఆ తప్పు జరగదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మహేష్ త్రివిక్రమ్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలు సృష్టించే కథాంశాలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గుంటూరు కారం టార్గెట్ భారీ టార్గెట్ కాగా ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది. గుంటూరు కారం (Guntur Kaaram) సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ కు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.