Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » హ్యాపీ బర్త్ డే టు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

హ్యాపీ బర్త్ డే టు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

  • October 23, 2023 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హ్యాపీ బర్త్ డే టు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

100 ఏళ్ళ  తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా నటించి ఖ్యాతి పొందారు ఎన్టీఆర్. సామాజిక చిత్రాల్లో ఏఎన్నార్ ఒక దిగ్గజం కాగా అత్యధిక సినిమాల్లో నటించి తెలుగు తెరకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణది. ఫెరోషియస్ పాత్రలకు కృష్ణంరాజు మకుటం లేని మహారాజైతే… బాక్సాఫీస్ అంకెలకు పరుగులు నేర్పింది మెగాస్టార్ చిరంజీవి. ఇలా..తెలుగు తెర దిగ్గజాల స్ఫూర్తిని, లెగసీని కొనసాగిస్తూ మన సినిమాను పాన్ ఇండియా స్థాయికి చేర్చిన హీరో ప్రభాస్. ఇవాళ ఈ పాన్ ఇండియా స్టార్, ఇండియన్ సినిమా ఛత్రపతి ప్రభాస్ పుట్టినరోజు.

న్యూ మిలీనియంలో మహేశ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ లాంటి కొత్త స్టార్స్ తెలుగు తెరపై ఎమర్జ్ అయ్యారు. ఆ టైమ్ లోనే ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టారు చేశారు ప్రభాస్. అరంగేట్రం వరకే వారసత్వం…ఆ తర్వాత నిలబెట్టేది వారి సత్తానే అని ప్రూవ్ చేశాడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో పరిచయం అయిన ప్రభాస్…నటనలో ఆత్మవిశ్వాసం, పరిణితి ప్రదర్శించాడు. ఈశ్వర్ లో ప్రభాస్ పర్ ఫార్మెన్స్ చూసిన వారు అతనో ఫ్యూచర్ స్టార్ అని చెప్పేశారు. అన్ని ఎమోషన్స్ పలికించే ప్రభాస్ నటనతో పాటు డ్యాన్స్ లు, ఫైట్స్, అందానికి తగిన హైట్ ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. మొదటి సినిమాతోనే ప్రభాస్ హీరోయిజానికి అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం లభించింది.

వర్షం ప్రభాస్ కు తొలిసారి బిగ్ కమర్షియల్ సూపర్ హిట్ ఇవ్వగా..రాజమౌళి కాంబినేషన్ లో చేసిన ఛత్రపతి మాస్ హీరోగా తిరుగులేని స్టార్ డమ్ అందించింది. డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు ప్రభాస్. ‘రాఘవేంద్ర’ ‘అడవిరాముడు’, ‘చక్రం’, ‘పౌర్ణమి’, ‘యోగి’, ‘మున్నా’, ‘బుజ్జిగాడు’ ‘బిల్లా’, ‘ఏక్‌నిరంజన్‌’ ‘రెబల్‌’…వంటి సినిమాలన్నీ నటుడిగా ప్రభాస్ వెర్సటాలిటీ చూపిస్తాయి. మిర్చి..ఆయన కెరీర్ లో ఓ స్పెషల్ సూపర్ హిట్. బాహుబలి రెండు సినిమాల రికార్డ్ స్థాయి విజయాలతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్.

తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ మార్కెట్ ను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ కే దక్కుతుంది. ఏ తెలుగు హీరోకు సాధ్యం కాని రికార్డులెన్నో ప్ర‌భాస్ తిర‌గ‌రాశారు. తెలుగు సినిమాకు 2000 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించే స‌త్తా ఉంద‌ని బాహుబ‌లి -2తో ప్ర‌భాస్ నిరూపించాడు. ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన తొలి హీరో ప్ర‌భాస్‌. బాహుబలి రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఇక ఓన్లీ తెలుగు సినిమా చేసే స్థాయి దాటిపోయింది. కాలువల్లో స్టీమర్లు నడపలేం. అలాగే ప్రభాస్ ఇమేజ్ కూడా టాలీవుడ్ కే పరిమితం చేయలేనంత ఎదిగింది. అందుకు తగినట్లే భారీ పాన్ ఇండియా సినిమాలు లైనప్ చేసుకున్నారు ప్రభాస్.

ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాకుండా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్, అమెరికా వంటి విదేశాల్లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అభిమానుల్లో యువతతో పాటు సకుటుంబ ప్రేక్షకులు ఉన్నారు. ప్రభాస్‌ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్ట్యాచ్యూ కలిగిన తొలి సౌత్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం. సొసైటీకి తన అవసరం కలిగిన ప్రతిసారీ మనసున్న గొప్ప స్టార్ గా ప్రూవ్ చేసుకుంటారు ప్రభాస్. ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు. తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. విరాళాలు ఇవ్వడంలో ప్రభాస్ ది పెద్ద చేయి. మిగతా స్టార్స్ కంటే పెద్ద మొత్తంలో ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వాలకు అందిస్తుంటారు డార్లింగ్. సమాజం పట్ల, తన ప్రేక్షకుల పట్ల ప్రభాస్ కు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం.

సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు సంపాదించుకుంటున్న తొలి సౌత్ హీరో గా కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. ఆయన వ్యక్తిత్వం నోబుల్…ఇమేజ్ గ్లోబల్…స్టార్ డమ్ అన్ మ్యాచబుల్.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ సినిమాల లైనప్ చూస్తుంటే…ఫ్యూచర్ సినిమా రికార్డులకు ఆయనే ఛత్రపతి అని అంచనా వేయొచ్చు. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రాబోతోంది. భారీ బడ్జెట్ తో ప్రపంచస్థాయి టెక్నాలజీతో కల్కి 2898 ఏడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. టాలీవుడ్ హిస్టరీలో కల్కి 2898 ఏడీ సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని చెప్పుకోవచ్చు. శాన్ డియాగో కామిక్ కాన్ లో రిలీజ్ చేసిన కల్కి 2898 గ్లింప్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ తెచ్చుకుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఒక స్పెషల్ మూవీ కానుంది. ప్రభాస్ ను కొత్త జానర్ లో, సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు దర్శకుడు మారుతి. టి సిరీస్ నిర్మాణంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించే స్పిరిట్ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలన్నీ ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్నాయి. తన రాబోయో సినిమాలతో తెలుగు సినిమా గర్వించే విజయాలు సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే యూనివర్సల్ డార్లింగ్ ప్రభాస్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pan india star
  • #Prabhas

Also Read

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

trending news

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

59 mins ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

1 hour ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

23 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

1 day ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

22 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

22 hours ago
Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

22 hours ago
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

22 hours ago
Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version