Harish Shankar, Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసిన హరీష్ శంకర్!

పవన్ కళ్యాణ్ ప్లాప్స్ లో ఉన్నప్పుడు ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆయన కెరీర్ లో మరపురాని విజయాన్ని అందించి అభిమానులను ఖుషీ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా గురించి మొదటినుండి కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు హరీష్ శంకర్. పవన్ కు తానొక వీరాభిమానినని.. ఒక అభిమాని ఎలా చూడాలనుకుంటాడో అలానే పవన్ ను తన కొత్త సినిమా చూపించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

రీసెంట్ గా పవన్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ స్పేస్ కాసేపు ముచ్చట్లు పెట్టారు సినీ జనాలు. ఇందులో పాల్గొన్న హరీష్.. తమ కలయికలో రానున్న సినిమా గురించి ఎగ్జైట్ అయ్యేలా కొన్ని కామెంట్స్ చేశారు. అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే.. వాటిని అందుకునే దిశగా బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తున్నానని హరీష్ చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఈ సినిమా చూసిన తరువాత పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని థియేటర్ల నుండి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ఇంకా మొదలుకాలేదు కాబట్టి ఎక్కువ విశేషాలను రివీల్ చేయకూడదని ఆగుతున్నామని.. లేదంటే అభిమానులతో పంచుకోవడానికి చాలానే ఉందని.. ఒకదాని తరువాత మరొకటి రివీల్ చేద్దామని ఆడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు పవన్ వ్యక్తిగత ఇమేజ్ ను కూడా దృష్టిలో పెట్టుకొని ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Share.