సినిమా డైలాగ్‌కు పొలిటికల్ టచ్ ఉండాలి… కానీ అది పొలిటికల్ డైలాగ్ అవ్వకూడదు. ఇలాంటి లాజిక్‌తో డైలాగ్ రాయాలంటే, రాసి మెప్పించాలంటే ప్రజెంట్ పర్‌ఫెక్ట్‌గా సరిఓయే ఉదాహరణ ‘భగత్స్ బ్లేజ్’. అవును ఆ వీడియోలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పిన గ్లాస్ డైలాగ్‌కి భలే రెస్పాన్స్ వచ్చింది. ఆ డైలాగ్‌ను రాసిన ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్‌ను (Harish Shankar) పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఈ డైలాగ్ పవన్ స్పందించగా… ఇప్పుడు హరీశ్ శంకర్ స్పందించారు.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh). ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచగా.. ఈ మధ్య విడుదల చేసి బ్లేజ్ వీడియో ఇంకా అదిరిపోయింది. ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది’, ‘గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఆ డైలాగ్‌లపై పవన్ ఓ మీటింగ్‌లో మాట్లాడుతూ… సినిమాలో అలాంటి డైలాగులు ఎందుకని హరీశ్‌ను అడిగాను. ‘మీకు తెలియదు.. మా బాధలు మాకున్నాయి.
ఇలాంటి డైలాగులు రాయకపోతే అభిమానులు ఊరుకోరు’ అని అన్నారు’ అంటూ మాట్లాడారు. ఆ వీడియోను తాజాగా హరీశ్ శంకర్ షేర్ చేస్తూ… ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు సర్కార్. మీరు అంగీకరించాలే కానీ, ఇలాంటివి ఇంకా చాలా రాస్తా’’ అని అన్నారు. దీంతో ఈ మాటలు వైరల్‌గా మారాయి. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఆ సినిమా రీమేక్ కావడం, ఈ సినిమా కూడా రీమేక్ కావడం…
రెండింట్లో పవన్ పోలీసుగా ఉండటం లాంటి కారణాల వల్ల ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు. పవన్ సరసన శ్రీలీల (Sreeleela) నటిస్తున్న ఈ సినిమాను గతేడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పవన్ రాజకీయ కార్యక్రమాల వల్ల అప్పుడు షూటింగ్ పూర్తవ్వలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల తర్వాత పవన్ ఫుల్ ప్లడ్జ్ డేట్స్ ఇచ్చి సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట.