అవును నిన్న విడుదలయిన జనతా గ్యారేజ్ మిక్స్డ్ టాక్ తో సూపర్ హిట్ గా రన్ అవుతుంది. భారీ అంచనాలతో విడుదలయిన ఈ సినిమా తొలి ఆటకు అభిమానుల అంచనాలను అందుకోనప్పటికీ పాసిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి. ఆయనతో ఎన్టీఆర్ సినిమా చేస్తాడు అని కానీ, ఈ కాంబినేషన్ లో సినిమా తెలుగులో వస్తుంది అని కానీ ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ కాంబినేషన్ ను సెట్ చేసిన దర్శకుడిని మనం అభినందించి తీరాల్సిందే. ఇంకా చెప్పాలి అంటే ముఖ్యంగా ఎన్టీఆర్, తెలుగులో ఎన్టీఆర్ ఎంతటి మాస్ హీరోనో అందరికీ తెలుసు. సింగల్ మ్యాన్ షో తో తన సినిమాలను హిట్ చేసుకునే కెప్యాసిటీ ఉన్న ఎన్టీఆర్ సినిమాలో ఒక మళయాళ సూపర్ స్టార్ నటించడమే కాకుండా, అక్కడక్కడా, ముఖ్యంగా ప్రధమార్ధంలో మోహన్ లాల్ డామినేషన్ బాగా కనిపించినప్పటికీ ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం నిజంగా ఆయన్ని మెచ్చుకుని తీరాల్సిన విషయం.
అంతేకాకుండా అదే క్రమంలో మోహన్ లాల్ కు మన కొరటాల….ఎన్టీఆర్ ఇచ్చిన గౌరవం చూస్తే ముచ్చట వెయ్యక మానదు….సినిమా టైటిల్స్ లో ముందుగా మోహన్ లాల్ పేరు వేయడం, సినిమాలో కూడా ప్రథమార్థం మోహన్ లాల్ పాత్రతో కధను నడిపించడం. ద్వితీయార్థంలో తారక్ రంగంలోకి దిగినా కూడా ఆ పాత్రను మూలకి పడేశారు అనే ఫీలింగ్ ఎక్కడా కలుగకుండా దాని ప్రాధాన్యతను నిలుపుతూనే కధను ముందుకు నడపడం….పతాక సన్నివేశానికి వచ్చేసరికి మరోసారి మోహన్ లాల్ పాత్ర ప్రాధాన్యం ఇస్తూ సినిమాను ముగించడం ఇలా ఎన్నో విషయాల్లో మోహన్ లాల్ కు ప్రత్యేక గౌరవాన్ని కట్టబెట్టారు మన వాళ్ళు….తారక్, కోరటాల మీకు హ్యాట్స్ ఆఫ్!!!