ఒకప్పుడు తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన భామ హీరా రాజ్ గోపాల్ (Heera Rajagopal). తాజాగా ఈమె స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) గురించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. హీరా రాజ్ గోపాల్ మాట్లాడుతూ… “కెరీర్ ప్రారంభంలో నేను ఓ పెద్ద హీరోతో రిలేషన్‌లో ఉండేదాన్ని. ఇది జనాలకు బాగా తెలుసు.అయితే చివరికి అతను నన్ను ఓ ఛీటర్‌గా, డ్రగ్స్ బానిసగా చిత్రీకరించడం జరిగింది. నేను, వయసులో ఉన్నప్పుడు ఆ హీరో నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చేవాడు.
నన్ను ప్రేమించానని చెప్పాడు. అతనికి బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టి నేను అతనికి అండగా నిలబడ్డాను. నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు.కానీ ఒక్క రాత్రిలో నన్ను విలన్ గా మార్చేశాడు.అతను వెన్నెముక గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు దగ్గరుండి సేవలు చేశాను. అటు తర్వాత ఏమైందో ఏమో తెలీదు. నన్ను దూరం పెట్టాడు. ‘పని మనిషిలా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. నేను తప్ప ఆమె వైపు ఎవ్వరూ చూడకూడదు.
ఇక నచ్చిన అమ్మాయితో సె*క్స్ చేస్తా. నా లైఫ్ నా ఇష్టం’ అంటూ క్రూరంగా మాట్లాడాడు. ఇవన్నీ బయట పెట్టినందుకు అతని అభిమానులు నాపై అలాగే నా ఇంటిపై దాడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి” అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘హీరా ఆలయ’ అనే వెబ్సైట్లో హీరా రాజ్ గోపాల్ ఇలా రాసుకొచ్చినట్టు తెలుస్తుంది.
ఆమె మాటల్లో పేరు చెప్పకపోయినా… ‘కాదల్ కొట్టాయ్’, ‘తొడరం’ సినిమాల టైంలో అజిత్, హీరా ప్రేమించుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.తర్వాత ఓ సందర్భంలో అజిత్ ‘హీరా ఒక డ్రగ్ అడిక్ట్’ అని చెప్పడం కూడా జరిగింది.