పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తుంటారు టాలీవుడ్ జనాలు. సింగిల్ ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలని నటీనటులు అనుకుంటే… ఒక్క సీన్‌కి పని చేసినా చాలని సాంకేతిక నిపుణులు అనుకుంటూ ఉంటారు. అయితే ఆ మాటకొస్తే స్టార్ హీరోల విషయంలో ఇంచుమించు ఇలానే ఉంటుంది. అయితే అంతా ఓకే అనుకుని, సినిమా రెడీ, రేపో మాపో ఓపెనింగ్ అని ఆగిపోయినవి ఉంటాయి. అలా పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాల సంగతి ఓసారి చూద్దాం.
* పవన్ కల్యాణ్(Pawan Kalyan) , అమీషా పటేల్ జంటగా ఓ సినిమాను సూర్య మూవీస్ ప్లాన్ చేసింది. కానీ అదే సినిమాను ‘నువ్వే కావాలి’ పేరుతో తెరకెక్కించారు. తొలుత అనుకున్న ప్రాజెక్ట్.. ఇదీ ఒకటి కాదు.
* ఏసుక్రీస్తు జీవితంపై పవన్ కళ్యాణ్ హీరోగా సింగీతం శ్రీనివాస రావు ఓ సినిమా అనౌన్స్ చేశారు. భారీ స్థాయిలో సినిమాలో అనుకున్నా.. కారణాలు తెలియదు కానీ.. ప్రాజెక్ట్ అయితే ఆగిపోయింది.
* రాయలసీమ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ‘కోబలి’ అనే పేరు కూడా అనుకున్నారు. కానీ ఇప్పటివరకు సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు.
* ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేష్‌బాబు క్యారెక్టర్‌కు తొలుత పవన్‌ను అనుకున్నారని టాక్. కానీ కొన్ని టర్న్స్ తర్వాత వెంకటేశ్ బ్రదర్‌గా సూపర్‌స్టార్ ఎంపికయ్యాడు.
* ‘జానీ’ సినిమా తర్వాత పవన్ మరోసారి మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. అదే ‘సత్యాగ్రహి’. ఈ సినిమాకు సంబంధించి భారీ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. దీంతోపాటు పవన్ దేశభక్తి నేపథ్యంలో సొంతంగా కథ రాసుకుని ‘దేశీ’ చేద్దాం అనుకున్నారు. అది కూడా ‘సత్యాగ్రహి’లాగే అయిపోయింది.
* ఇవి కాకుండా వి.వి.వినాయక్, రాఘవ లారెన్స్, సంపత్ నంది, ఎస్.జె.సూర్య, నీసన్ (వేదాళం రీమేక్) అనుకున్నట్లు అనుకుని సెట్స్‌పైకి రాలేదు. ఇలా పవన్ సినిమాలకు బయటకు తెలిసి ఆగిపోయినవి. ఇవి కాకుండా కథలు వినే స్టేజీలో ఆయన ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’, ‘ఇడియట్’ లాంటి కథలు వదిలేశారు అని కూడా అంటారు.