మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985 వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్ చేయనున్న సినిమా ఒకే అయింది. మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఎల్.ఎల్.పి పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
ప్రస్తుతం ఆర్టిస్టుల ఎంపిక చేస్తున్నారు. ఇందులో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్టు సమాచారం. అటు హీరో, ఇటు డైరక్టర్ ఆమె పైనే ఆసక్తి కనబరుస్తున్నారని తెలిసింది. ఇదివరకు రకుల్ చెర్రీతో బ్రూస్ లీ, ధృవ సినిమాల్లో నటించింది. అలాగే బోయపాటి దర్శకత్వంలో సరైనోడు, జయ జానకీ నాయక చేసింది. అప్పటి నుంచి వీరిమధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే ఇందులో ఆమెను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈ న్యూస్ నిజమైతే వారిద్దరితో రకుల్ మూడో మూవీ చేస్తున్నట్టే.