మాధవన్, సుర్వీన్ చావ్లా నటించిన కొత్త వెబ్ సిరీస్ ‘డీ కపుల్డ్’ స్ట్రీమింగ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. చాలా దేశాల్లో టాప్ 10లో ఈ సిరీస్ కొనసాగుతోంది. నటుడు మాధవన్ ఆ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. మన దేశంలో ఆ సిరీస్ టాప్2లో ఉందంటూ ఆ ట్వీట్‌లో చూపించాడు మాధవన్. అతనే కాదు… చాలామంది ఫ్యాన్స్ కూడా వాళ్ల వాళ్ల దేశాల్లో ఆ సిరీస్ టాప్ ట్రెండింగ్‌లో ఉందంటూ… ట్వీట్లు చేస్తున్నారు.
దీంతో మాధవన్ ఫ్యాన్స్ చాలా ఖుష్ అవుతున్నారు. మాధవన్ ఎక్కడ అడుగుపెట్టినా సూపర్ హిట్టే అనుకుంటున్నారు. అయితే ఈ సిరీస్ విషయంలో విమర్శలు కూడా వస్తున్నాయి అనుకోండి. ఆ విషయం మీద సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అయితే ఇంకో విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాధవన్ ట్వీట్ చేసిన స్క్రీన్ షాట్‌లోనే ఆ విషయం ఉంది. ఆ ట్వీట్‌లో చూస్తే… ‘డీకపుల్డ్’ ఫొటో కింద వాచ్ ఇట్ అగైన్ అని ఉంటుంది. దాంతోనే చర్చ మొదలైంది.
వాచ్ ఇట్ అగైన్ బ్లాక్‌లో చూస్తే… మూడు సినిమాలు కనిపిస్తాయి. అంటే అవి మాధవన్ గతంలో చూసిన సినిమాలు/ సిరీస్‌లు అక్కడ కనిపిస్తాయి. వాటిలో మూడు సినిమాలో కనిపిస్తున్నాయి. తొలి సినిమా జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్’. ఆ తర్వాతి రెండు సినిమాలు ‘365 డేస్’, ‘ఫిఫ్టీ షేడ్ష్ ఆఫ్ గ్రే’. ఆఖరి రెండు సినిమాల గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఎరోటిక్ మూవీస్‌లో ఈ రెండు సినిమాలకు మంచి ఖ్యాతే ఉంది. అందులో ఏముంది మాధవన్ అలాంటి సినిమాలు చూడకూడదా అంటారా.
చూడొచ్చు… అయితే అవి చూశాను అనే విషయం తెలిసేలా స్క్రీన్ షాట్ తీయడం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇక్కడ విషయం. ఒకవేళ వేరే వాళ్లు ఆ స్క్రీన్ షాట్ తీసి ఉంటే… షేర్ చేసే ముందు చూసుకోవాలి కదా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ముందు చెప్పినట్లు ఈ సిరీస్ వివాదం గురించి చూస్తే… మనుషులు, ఓ వర్గం మనోభావాలను దెబ్బ తీసేలా ఈ సిరీస్ ఉంది అంటూ తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో, అందులోనూ మాధవన్ నుండి ఇలాంటి సిరీస్ రావడమేంటి అని చెవులు కొరుక్కుంటున్నారు.