Hero Nani: శ్యామ్ సింగ రాయ్.. రిలీజ్ కు ముందు అంత జరిగిందా?

నేచురల్ స్టార్ నానికి ‘జెర్సీ’ తర్వాత సరైన హిట్టు లేదు. ఆ సినిమా కూడా కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో, అంటే ‘శ్యామ్ సింగ రాయ్’ కు ముందు వరకు నానికి హిట్ అని చెప్పుకోడానికి అదొక్కటే సినిమా. అటు తర్వాత వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ‘వి’ ‘టక్ జగదీష్’ వంటి చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై నిరాశపరిచాయి. ‘వి’ ‘టక్ జగదీష్’ చిత్రాల విషయంలో అయితే నాని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.

కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైములో ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ వచ్చింది. డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. చెప్పాలంటే అనేక అడ్డంకుల నడుమ ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఏపిలో పరిస్థితులు ఏమీ బాలేదు. ‘శ్యామ్ సింగ రాయ్’ కి రూ.55 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాడు నిర్మాత. నాని గత చిత్రాలు నిరాశపరచడం.. పైగా ఏపిలో థియేటర్ల పరిస్థితులు అంతగా బాగోకపోవడం..

ఇవి చాలవన్నట్టు పలు సినిమా వేడుకల్లో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో అతని పై నెగివిటీ నేర్పడడం.. అబ్బో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ కు పెద్ద రేంజ్లో అయితే బిజినెస్ జరగలేదు. డిసెంబర్ 24కి ముందు రోజు వరకు ఈ సినిమా విడుదలవుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే నిర్మాత ధైర్యం చేసి ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. నాని కూడా తన వంతుగా రూ.5 కోట్ల పారితోషికం వెనక్కి ఇచ్చేశాడట.

అతనికి ఆఫర్ చేసిన రూ.8 కోట్ల పారితోషికంతో రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చేయగా అతనికి మిగిలింది రూ.3 కోట్లు మాత్రమే. తన సినిమా థియేటర్లలో విడుదలవ్వాలి అనేది నాని బలమైన సంకల్పం.. అందుకోసమే అతను ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తుంది. నిర్మాతల్ని ఆదుకోవడానికి నానిలా మిగిలిన హీరోలు ధైర్యం చేస్తారా? అంటే సందేహమే..!

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus