రవితేజ కోసం తనకు నచ్చిన సినిమా వదులుకున్న నాని!

కథ నచ్చక కొందరు, కథ నచ్చినా డేట్లు సర్ధుబాటు చేయలేక మరికొందరు సినిమాలు వదులుకుంటూ ఉంటారు. కానీ నేచురల్ స్టార్ నాని మాత్రం రవితేజ కోసం సినిమాను వదులుకున్నారట. ఇప్పుడు ఈ వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శకుడు త్రినాధరావు నక్కిన నానికి ఓ కథను చెప్పారట. ఆ కథను విన్న నాని.. అందులో నటిస్తానని చెప్పారట. కానీ ఈ ఏడాదికి నాని డైరీ ఫుల్ అయింది. అన్ని రోజులు త్రినాధరావుని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. ఇప్పటికే ఆయన చాలా రోజులుగా ఖాళీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ కథ రవితేజకి బాగా సెట్ అవుతుందని భావించిన నాని.. ఈ విషయాన్ని త్రినాధరావుకి చెప్పారట.

ఇక రవితేజకి కూడా ఈ కథను వినమని నాని సూచించారట. దీంతో త్రినాధరావు.. రవితేజకి కథ చెప్పడం డానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. అలా నాని.. రవితేజ కోసం తన వద్దకు వచ్చిన సినిమాని వదులుకున్నట్లు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా నిర్మించబోయే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవితేజ.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ చిత్రంతో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలోనూ నటించబోతున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus