Hero Nani: ఆ సంఘటనతో చాలా భయపడిపోయాను… నాని కామెంట్స్ వైరల్!

నాచురల్ స్టార్ నాని మొదటిసారి తన కెరీర్ లో విభిన్నమైన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నటువంటి చిత్రం దసరా. ఈ సినిమాలో నాని పూర్తిగా ఢీ గ్లామర్ రోల్ చేయనున్నారు. ఈ సినిమా మార్చ్ 30 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బొగ్గు గనులు నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మాస్ లుక్ ఇప్పటికే అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచుతుంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ లో భాగంగా నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమాలోని ఒక భయంకరమైన సన్నివేశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… ఓ సన్నివేశంలో భాగంగా డంపర్ ట్రక్ బొగ్గు తీసుకెళ్లి డంప్ చేస్తుంది.

ఇందుకు సంబంధించిన సీన్ లో నేను డంపర్ ట్రక్ నుంచి కింద పడిపోతే ఆ బొగ్గు నాపై పడాలి. అయితే ఇందుకోసం సిలికాన్ బొగ్గును తయారు చేశారు.అయితే అది మొత్తం డస్ట్ తో నిండి ఉంటుంది. ఇక ఈ సన్నివేశంలో నేను ట్రక్ నుంచి కింద పడినప్పుడు నన్ను ఆ బొగ్గు కింద నుంచి పైకి లేపాలి. ఇలా లేపడానికి కాస్త సమయం పడుతుంది. అయితే ఆ సమయంలో తాను శ్వాస తీసుకోకుండా ఉండాలి. ఇలా శ్వాస కనుక తీసుకుంటే ఆ డస్ట్ మొత్తంలో లోపలికి వెళ్ళిపోతుంది.

అయితే ఈ షూటింగ్ సమయంలో తాను చాలా కష్టపడ్డానని ఈ సన్నివేశం పూర్తి అయిన నేను కింద పడటం,బొగ్గులోనుంచి నన్ను పైకి లేపడం వంటి సంఘటనలు గుర్తొచ్చేవని, ఇవి గుర్తొస్తే నాకు నిద్ర కూడా పట్టేది కాదని ఇలా దాదాపు రెండు నెలలపాటు ఈ సంఘటనలను గుర్తుచేసుకొని భయపడ్డానని నాని ఈ సందర్భంగా ఆ సన్నివేశం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus