Nithiin: మరోసారి కీర్తితో నితిన్ రొమాన్స్..?

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తన తదుపరి సినిమాలకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మెగాస్టార్ తన సినిమాల్లో ఇప్పటి జెనరేషన్ హీరోలు కూడా ఉండేలా చూసుకుంటున్నారు. అలా కావాలని చేస్తున్నారో..? లేక కథ డిమాండ్ చేస్తుందో తెలియదు కానీ.. రకరకాల కాంబోలు మాత్రం వస్తున్నాయి. ‘ఆచార్య’లో రామ్ చరణ్ పాత్ర పెద్దగా ఉపయోగపడలేదు.

‘గాడ్ ఫాదర్’లో సత్యదేవ్ రోల్ ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. ‘వాల్తేర్’ వీరయ్యలో రవితేజ ఉన్నారనే ప్రకటన అంచనాలను పెంచేసింది. తాజాగా ‘భోళా శంకర్’కి సైతం అలాంటి టాకే వినిపిస్తోంది. ఇందులో మెగాస్టార్ చెల్లెలిగా నటిస్తోన్న కీర్తి సురేష్ కి జోడీగా యంగ్ హీరో నితిన్ ని లాక్ చేసినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఓకే చేశారని టాక్. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకోవాలని చూస్తున్నారు.

అందుకే చిన్న రోల్ అయినా నటించడానికి ముందుకొస్తున్నారు. నితిన్ కూడా ఈ కోణంలోనే ఆలోచించి ఉండొచ్చు. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి! మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తోన్న ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ త్వరలోనే రీస్టార్ట్ కానుంది. ‘గాడ్ ఫాదర్’కి సంబంధించిన పనులన్నీ దాదాపు ఓ కొలిక్కి వచ్చాయి.

సల్మాన్ తో చేయాల్సిన పాట షూటింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఎలాగో హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి షూటింగ్ పూర్తి చేసేయొచ్చు. ఆ తరువాత ‘భోళా శంకర్’ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus