Rana: తిరుమలలో సందడి చేసిన రానా దంపతులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ నేడు తిరుమలలో సందడి చేశారు. సురేష్ బాబు ఆయన సతీమణి అలాగే ఆయన కుమారులు రానా దంపతులు, రానా సోదరుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరంతా స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేకంగా స్వాగతం పలకడమే కాకుండా స్వామివారి దర్శనం అనంతరం పండితులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇలా స్వామివారి దర్శనం అనంతరం రానా ఆయన సతీమణి మీహిక ఆలయం వెలుపలకు రావడంతో ఒక్కసారిగా మీడియా వారిపై ఫోకస్ చేశారు.ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆలయ ప్రాంగణంలో రానాతో సెల్ఫీ తీసుకోవడం కోసం ఎగబడ్డారు. ఇలా హీరో రానాను సెల్ఫీ అడగడంతో రానా ఏకంగా తన అభిమాని మొబైల్ ఫోన్ లాక్కొని సీరియస్ అవుతూ ఆలయ ప్రాంగణంలో వద్దు అంటూ తనపై సీరియస్ అయ్యారు. తిరిగి తన అభిమాని ఫోన్ తనకు ఇచ్చేశారు.

రానాతో పాటు ఉన్నటువంటి సిబ్బంది తనని వెనక్కి పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వీడియోలో మనం రానా దంపతులను మాత్రమే కాకుండా సురేష్ బాబు దంపతులను కూడా చూడవచ్చు. ఇలా కుటుంబ సభ్యులందరూ కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత కొద్దిరోజులుగా రానా దంపతుల విడాకులు తీసుకొని విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఈ దంపతులు ఎప్పటికప్పుడు తమ గురించి వచ్చే వార్తలను కొట్టి పారేశారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus