కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సూర్య, కార్తీ ముందువరసలో ఉంటారు. ఈ హీరోలు ఇతరులకు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారు. చెన్నై వరద బాధితులకు సూర్య, కార్తీ రూ.10 లక్షల సాయం చేయడం గమనార్హం. తుఫాన్ వల్ల తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా వర్షపు నీరు వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో ఇప్పటికే 8 మంది మృతి చెందారని తెలుస్తోంది.
సూర్య, కార్తీ వరద బాధితులకు చేసిన సాయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోల మనస్సు మంచి మనస్సు అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరద బాధితులకు సాయం చేసే విషయంలో కోలీవుడ్ హీరోలు ముందువరసలో ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూర్య, కార్తీ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సూర్య నటిస్తున్న కంగువా సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్దాయి.
2024 సంవత్సరం ఏప్రిల్ నెల 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సూర్య సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుండటం గమనార్హం. సూర్య పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉంది. సూర్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా సూర్య, కార్తీ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకక్కినా బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూర్య, కార్తీ వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
కార్తీ (Karthi) గత సినిమా జపాన్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఫ్లాపైన ఈ సినిమా ఓటీటీలో హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో వరుసగా క్రేజీ సినిమాలను విడుదల చేస్తుండటం గమనార్హం.