Hero Suriya: తెలుగులో సూర్య సినిమాని కొనేవాళ్ళే లేరట..!

సూపర్ స్టార్ రజనీకాంత్,యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఓ సాలిడ్ మార్కెట్‌ని ఏర్పరచుకున్న తమిళ హీరో సూర్య. అజిత్, విజయ్ వంటి వారు సూర్య కంటే ముందు తెలుగులో మార్కెట్ ను ఏర్పరుచుకోవాలని ప్రయత్నించారు కానీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడైతే విజయ్… కు క్రేజ్ ఇక్కడ భారీగా పెరిగింది లెండి. అయితే విజయ్ కంటే ముందు తెలుగులో ఉన్న టైర్ 2 హీరోలతో సమానంగా సూర్య తన మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు.

డబ్బింగ్ సినిమాలతోనే సూర్యకి ఇక్కడ రూ.15 కోట్ల థియేట్రికల్ మార్కెట్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోని బయ్యర్లు సూర్య సినిమాలను కొనుగోలు చేసేందుకు ఎగబడేవారు.కానీ ఈ మధ్య కాలంలో సూర్య సినిమాలు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయడం లేదు. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా సూర్య సినిమాలకి థియేట్రికల్ మార్కెట్ తగ్గింది. NGK, సింగం 3, కప్పాన్ వంటి సినిమాలు ఘోరంగా డిజాస్టర్లు అయ్యాయి. ఓటిటిల్లో విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయినప్పటికీ సూర్యకి కలిసొచ్చింది ఏమీ లేదని స్పష్టమౌతుంది.

విషయం ఏంటంటే.. సూర్య అప్ కమింగ్ మూవీ ‘ఎతర్కుమ్ తునింధవం’ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను రూ.10కోట్లకి ఆఫర్ చేస్తే.. అంత పెట్టి కొనుగోలు చేయడానికి ఇక్కడి బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కనీసం రూ.5 కోట్లకి కొనుగోలు చేయడానికి కూడా బయ్యర్స్ ముందుకు రావడం లేదట.

రూ.4కోట్లకి అయితే ఓ చిన్న నిర్మాత ఓకె చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ‘ఎతర్కుమ్ తునింధవం’ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus