‘కె.జి.ఎఫ్’ హీరో యష్- రాధికా పండిట్ ల పెళ్ళి ఫోటోలు చూసారా?

2018 వ సంవత్సరం డిసెంబర్ 21న తెలుగు,హిందీలో రిలీజ్ అయిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. కానీ అదే రోజున ఓ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయ్యింది. అది కూడా కన్నడ డబ్బింగ్ సినిమా. అదే ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి జనాలు ఎగబడుతూ వెళ్తున్నారు. అంత బాగుందా అని డౌట్ పడ్డ జనాలు కూడా ఎగేసుకుని వెళ్లడం మొదలుపెట్టారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇక్కడ ఎవ్వరికీ పరిచయం లేని వ్యక్తి.

Click Here To Watch NOW

అలాగే ఆ చిత్రం హీరో కూడా ఎవ్వరికీ తెలీదు. కట్ చేస్తే మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ హీరోకి అలాగే దర్శకుడికి ఓవర్ నైట్లో స్టార్ డం వచ్చేసింది. ఇక ఇప్పుడు ‘కె.జి.ఎఫ్2’ విడుదలయ్యాక ఇక్కడ స్టార్ హీరో రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు యష్. కన్నడలో అతను ఓ స్టార్ హీరో. ఇతను సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండీ వచ్చిన వ్యక్తి కాదు.

ఓ ఆర్టీసీ డ్రైవర్ కొడుకు అంతే. మొదట సీరియల్లో నటించేవాడు. తర్వాత సింగర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అదే టైములో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేయడం మొదలుపెట్టాడు. ‘నంద గోకుల’ సెట్స్‌ లో ఇతనికి హీరోయిన్ రాధిక పండిట్‌ తో పరిచయం ఏర్పడింది. 2008 లో వచ్చిన ‘మొగ్గిన మనసు’ చిత్రాన్ని శశాంక్ డైరెక్ట్ చేసాడు. ఈ మూవీలో యష్ కు జోడీగా రాధికా పండిట్ నటించింది. అటు తర్వాత వీళ్ళిద్దరూ కలిసి 4 సినిమాల్లో కలిసి నటించారు.

అలా వీరి పరిచయం కాస్త స్నేహం, అది కాస్తా ప్రేమ, పెళ్ళికి దారితీసింది. 2016 ఆగస్టు లో గోవాలో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. 2016 డిసెంబర్ 9 న వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఓ పాప, బాబు ఉన్నారు. వీళ్ళ పెళ్లి ఫోటోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus