ఆ హీరోలకు పవన్ ఛాన్స్ ఇచ్చారా?

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దబాంగ్ రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా గతంలో ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఎంపికైనట్లు జోరుగా వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా సమంత స్పందించి తాను పవన్ సినిమాలో నటిస్తున్నానని వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ లో నటించనున్నారని పూజా హెగ్డే, ప్రియమణి నటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన డీజే, గద్దలకొండ గణేష్ సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.

పవన్ కళ్యాణ్ పూజా హెగ్డే కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఇప్పటికే పవన్ మినహా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ తో నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Share.