Dasara Movie: నాని సినిమాలో ఎలెక్షన్ సీక్వెన్స్.. మాములుగా ఉండదు!

నేచురల్ స్టార్ నాని ఇటీవల ‘అంటే సుందరానికి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, చిన్న టీజర్, సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ విషయం బయటకొచ్చింది. అదేంటంటే.. కథ ప్రకారం సినిమాలో ఎన్నికల ఎపిసోడ్ ఉంటుందట. నాని గ్రూప్, ప్రత్యర్థి గ్రూప్ ల మధ్య పోటాపోటీగా ఒక ఎలెక్షన్ సీక్వెన్స్ ను డిజైన్ చేశారు.

గోదావరిఖని మైన్స్ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల ప్రచారం మీద సినిమాలో ఒక పాట కూడా ఉంటుందట. ఇదొక బిట్ సాంగ్ గా వస్తుందని సమాచారం. నాని ఇదివరకు ఎప్పుడూ చేయని మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. సెట్ లో నాని లుక్ చూసిన వారెవరూ కూడా ఆయన్ను గుర్తుపట్టలేకపోతున్నారట. అంతలా ఈ సినిమా కోసం తన మేకోవర్ ను మార్చుకున్నారు.

ఈ సినిమాతో భారీ హిట్టు కొట్టాలని చూస్తున్నారు నాని. అందుకే ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ కీలకపాత్ర పోషిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus