చరణ్-రవితేజ కాంబో : స్పీడు మీదున్న నితిన్ : చిరు ఆవేదన

స్టార్ హీరో రామ్ చరణ్ ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చరణ్ హీరోగా సక్సెస్ కావడంతో పాటు నిర్మాతగా కూడా విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. తండ్రి చిరంజీవితో ఎక్కువగా సినిమాలను నిర్మించిన చరణ్ మాస్ మహారాజ్ రవితేజతో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్ ను నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నితిన్ కెరీర్ మొత్తంలో విజయాల కంటే అపజయాలే ఎక్కువ. ముఖ్యంగా డిజాస్టర్ సినిమాలతో ఒకనొక సమయంలో మళ్ళీ కనిపించాడేమో అనేంతలా టాక్ వచ్చింది. అయినప్పటికీ మనోడు పవర్ స్టార్ అభిమానిగా బాగానే క్లిక్కయ్యాడు. ఇష్క్ సినిమా నుంచి కాస్త రోటీన్ సినిమాలను పక్కనపెట్టి కొత్తగా ట్రై చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా నితిన్ కంటిన్యూగా డిజాస్టర్ ఎదుర్కోవడం అలవాటుగా మారిపోతోంది. గతంలో అఆ హిట్టయిన అనంతరం లై, ఛల్ మోహన్ రంగా,శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇక ఆ తరువాత భీష్మాతో సెట్టయ్యడాని అనుకునే లోపే చెక్, రంగ్ దే సినిమాలతో మరోసారి అపజయాలు ఎదుర్కొన్నాడు. ఇక ఇప్పుడు ఎలాగైనా బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ రీమేక్ తో హిట్ కొట్టాలని రెడీ అవుతున్నాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినిమా రంగంలో నటుడిగా సత్తా చాటడంతో పాటు ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ చిరంజీవి అభిమానులను సంపాదించుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి పాలిటిక్స్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా చిరంజీవి ఎంతో మందికి సేవ చేస్తుండటం గమనార్హం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరనే సంగతి తెలిసిందే. మున్నా సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన వంశీ పైడిపల్లి బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు. మహర్షి సినిమా విడుదలై రెండు సంవత్సరాలైనప్పటికీ వంశీ పైడిపల్లి కొత్త సినిమా మొదలు కాలేదు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా త్వరలో ఒక సినిమా తెరకెక్కనుండగా లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికారక ప్రకటన రానుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ హీరోగా కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ తమ స్వగ్రామైన బుర్రిపాలెంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అభిమానులను దృష్టిలో ఉంచుకుని మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సహకారం అందించడంతో పాటు గ్రామంలో ఆరురోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus