యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సక్సెస్ సాధించినా బాహుబలి2 ప్రభాస్ కు ఉపయోగపడిన స్థాయిలో ఆర్ఆర్ఆర్ తారక్, చరణ్ లకు ఉపయోగపడదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ సక్సెస్ సాధించినా చరణ్ కు దక్కిన స్థాయిలో హిందీ ప్రేక్షకుల్లో తారక్ కు గుర్తింపు దక్కలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన హిందీ ప్రేక్షకులు చరణ్ యాక్టింగ్ ను ప్రశంసిస్తూనే తారక్ యాక్టింగ్ కు ఫిదా అయ్యామని చెబుతున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీ మాస్టర్ పీస్ అని హిందీ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒకే స్థాయి ఎనర్జీతో సినిమాలో అదరగొట్టారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్, చరణ్ లకు ఆర్ఆర్ఆర్ తో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగనుంది. ఎన్టీఆర్ కు హిందీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని భవిష్యత్తు ప్రాజెక్టులలో కొన్ని ప్రాజెక్టులను దక్షిణాది భాషల్లో మాత్రమే తెరకెక్కేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తారక్ ను ఆ పొరపాటు మాత్రం చేయవద్దని సూచనలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ వీక్ డేస్ లో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను అందుకుంది. శని, ఆదివారాలలో ఈ సినిమాకు భారీస్థాయిలో కలెక్షన్లు వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదివారం వరకు ఆర్ఆర్ఆర్ సాధించే కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో ఒక అంచనాకు రావచ్చు.
ఓవర్సీస్, నైజాం, హిందీ డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా అంచనాలను మించి లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడెడ్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో పుంజుకోవాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రాజమౌళి పాపులారిటీ మరింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లను పెంచడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.